ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీ కృష్ణుని అత్తవారి ఊరిలో మధుర-బృందావనం స్థాయిలో జన్మాష్టమి వేడుకలు!

ABN, First Publish Date - 2021-08-29T15:29:08+05:30

దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కుదర్ కోట్‌ను శ్రీకృష్ణుని అత్తవారిల్లుగా భావిస్తారు. కుదర్‌కోట్‌ను పూర్వకాలంలో కుందన్‌పూర్‌గా పిలిచేవారు. శ్రీకృష్ణుడు.. రుక్మిణీ దేవిని ఎత్తుకుని వెళ్లిపోయిన అనంతరం ఆమె సోదరుడు ఏనుగుల సాయంతో ఇక్కడి ప్రజలను తొక్కించాడట. 


ఈ ఘటన అనంతరం ఈ ప్రాంతానికి కుదర్‌కోట్ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుని ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. జన్మాష్టమి రోజున ఈ ఆలయంలో మధుర-బృందావనం స్థాయిలో వేడుకలు జరుగుతాయి. రోజంతా పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలోని వారంతా శ్రీకృష్ణుడిని తమ అల్లుడిగా భావిస్తూ, వేడుకలు నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాచీన శివాలయం కూడా ఎంతో ప్రసిద్ధి పొందింది. 2018 ఆగస్టు 15న ఇక్కడ ముగ్గురు సాధువులు హత్యకు గురయ్యారు. అనంతరం కుదర్‌కోట్ చర్చల్లో నిలిచింది. 

Updated Date - 2021-08-29T15:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising