ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌పై కొత్త జంట‌... అడ్డుకున్న‌ పోలీసులు ఏం చేశారంటే...

ABN, First Publish Date - 2021-05-13T15:55:06+05:30

క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న నేప‌ధ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న నేప‌ధ్యంలో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. మ‌రికొన్ని రాష్ట్రాల్లో క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప‌రిమిత సంఖ్య‌లో వివాహ వేడుక‌ల‌కు అనుమతిస్తున్నారు. తాజాగా నూత‌న వ‌ధూవ‌రుల‌కు సంబంధించిన ఒక వీడియో వైర‌ల్‌గా మారింది.  ఆ వీడియోలో... కొత్తగా పెళ్ల‌యిన ఒక జంట బైక్‌పై వెళుతూ క‌నిపిస్తోంది. క‌రోనా ప్రోటోకాల్ పాటిస్తూ వ‌రుడు... వధువును బైక్ పై తీసుకువెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన పోలీసు అధికారి ఆ నూత‌న దంపతులను అభినందించడమే కాకుండా కానుక‌లు కూడా ఇచ్చారు. 


ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కాగా ఈ వీడియోలో నూత‌న వధూవరులు తమ పెళ్లి అనంత‌రం బైక్‌పై ఇంటికి వెళుతున్నట్లు క‌నిపిస్తుంది. వారిని చూసిన‌ పోలీసు అధికారులు నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రికీ దండలు వేసి అభినందించారు. అలాగే వారికి కానుక రూపంలో  కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఈ వీడియోను మే 11 న ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా షేర్ చేసినప్పటికీ, ఈ ఉదంతం గత సంవత్సరం లాక్‌డౌన్ సమయంలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. 

                                                యూపీ ఖ‌బ‌రే సౌజ‌న్యంతో....

Updated Date - 2021-05-13T15:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising