ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ గార్డ్‌ని ఈ పాప ఏమి అడిగిందంటే..!

ABN, First Publish Date - 2021-11-06T23:44:44+05:30

న్యూఢిల్లీ: నేర్చుకోవాలనే తపన ఉంటే ప్రతి ఒక్క అనుభవమూ ఓ పాఠమే. కోవిడ్ మహమ్మారి విశ్వ మానవాళికి చేదు అనుభవాలే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నేర్చుకోవాలనే తపన ఉంటే ప్రతి ఒక్క అనుభవమూ ఓ పాఠమే. కోవిడ్ మహమ్మారి విశ్వ మానవాళికి చేదు అనుభవాలే మిగిల్చి ఉండొచ్చు. కానీ  కొన్ని గుణపాఠాలను కూడా నేర్పింది. మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పింది. ముఖ్యంగా ఎలా జీవించాలో నేర్పింది. తరచు టెంపరేచర్ చెక్ చేసుకోవడం, గంట గంటకూ హ్యాండ్ శానిటైజర్ల వాడటం, ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే మాస్క్ తప్పనిసరిగా ధరించడం వంటి జాగ్రత్తలు నిత్యకృత్యం చేసింది. తాజాగా ఒక చిన్నపిల్ల తాను గ్రహించిన విషయాన్ని, తనవంతు బాధ్యతను ఎంత చక్కగా నిర్వహించిందో చెప్పే వీడియో నెటిజన్లను కట్టిపడేస్తూ, వైరల్ అవుతోంది.


ఈ వీడియోలోని చిన్నపిల్ల నేరుగా భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లింది. అందరికీ టెంపరేచర్ చూసి, తనకు టెంపరేచర్ చూడలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నట్టుగా వారి ముందు చేతులు చాచింది. అంతేనా? తన టెంపరేచర్ చూపించుకోవడం అయిన తర్వాత తన చేతిలోని బొమ్మను కూడా ముందుకు చాపింది....టెంపరేచర్ చూడండంటూ. ఈ వీడియో వందలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దినేష్ జోషి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ''బాధ్యత కలిగిన పౌరులు ఇలా ఉండాలి'' అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో పాపపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ''ఎంత బాధ్యతగల సిటిజనో కదా. పాప చాలా బాగుంది, ప్రపంచానికి ఇదో చక్కటి పాఠం'' అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. పాప పుట్టిన దేశం, కన్న తల్లిదండ్రులకు ఈ క్రెడిట్ దక్కుతుందని, ఇంత పసి ప్రాయంలోనే ముందు జాగ్రత్త చర్యలు, బాధ్యతల సక్రమ నిర్వహణ అభినందనీయమని మరొకరు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-06T23:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising