ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: మీకు జీవితంలో విజయాన్ని అందించే 10 అద్భుత కొటేషన్లు.. నిత్యం స్మరించుకోండి!

ABN, First Publish Date - 2021-12-13T12:13:38+05:30

ఆచార్య చాణక్య.. మౌర్య వంశ చక్రవర్తి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్య.. మౌర్య వంశ చక్రవర్తి చంద్రగుప్త మౌర్య దగ్గర మహామంత్రిగా వ్యవహరించారు. చాణక్యునికి కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. చాణక్య.. నంద వంశాన్ని తుదముట్టించి.. చంద్రగుప్తు మౌర్యను మహారాజుగా చేశాడు. ఆచార్య చాణక్య.. అర్థశాస్త్రాన్ని, నీతి శాస్త్రాన్ని రచించారు. నీతి శాస్త్రంలో.. మనిషి తన జీవితంలో అనందంగా గడిపేందుకు అనుసరించాల్సిన విధానాలను తెలియజేశారు. వాటిలో మనిషికి అనునిత్యం ఉపయోగపడే కొన్ని నీతి నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


1. ప్రతీ స్నేహితునిలో ఎంతోకొంత స్వార్థం ఉంటుంది. స్వార్థమన్నదే లేని మిత్రుడెవరూ ఉండడు. ఇది కఠోర సత్యం.

2. మనిషి ఒంటరిగానే పుడతాడు. ఒంటరిగానే మరణిస్తాడు. అందుకే తాను చేసిన చెడు పనుల ఫలితాన్ని తానే అనుభవించాల్సి వస్తుంది. మరణించాక కూడా ఒంటరిగానే నరకానికి లేదా స్వర్గానికి వెళతాడు. 

3. పాము విషపూరితం కానప్పటికీ, అది బయటకు విష జంతువుగానే కనిపించాలి. ఇదేవిధంగా మనిషి కూడా తనను తాను యోగ్యునిగా ప్రకటించుకునే ప్రయత్నం చేయాలి. 

4. మనిషి తాను ఏమి చేయదలచుకున్నాడో ఇతరుల ముందు వ్యక్తం చేయకూడదు. దానిని రహస్యంగానే ఉంచాలి. మన ఆలోచనలను పనులలో చూపాలి.

5. విద్య మనిషికి మంచి మిత్రుడు. విద్యాధికుడైన వ్యక్తి అన్నిచోట్లా గౌరవ మర్యాదలు అందుకుంటాడు. సౌందర్యం, యవ్వనం మనిషిని తప్పుదారి పట్టిస్తాయి.


6. మీకు ఎటువంటి భయాలు ఎదురైనా, వాటిపై దాడి చేసి వెంటనే తరిమికొట్టండి

7. గుడ్డివానికి అద్దం ఎలాంటిదో మూర్ఖునికి పుస్తకంతో ఉపయోగం అలాంటిది.

8. పుట్టుకతోనే ఎవరూ మహనీయులు కాలేరు. అతని పనుల ద్వారానే అది సాధ్యం.

9. ఎండిన చెట్టు అడవినంతా ఎలా దహనం చేయగలదో, ఒక దుర్మార్గుని కుమారుడు కుటుంబాన్నంతా నాశనం చేస్తాడు. 

10. మనం గడచిపోయిన కాలం గురించి చింతించనవసరం లేదు. భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. తెలివైన వ్యక్తి నిత్యం వర్తమానంలో జీవించాలి.

Updated Date - 2021-12-13T12:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising