ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పార్లమెంట్ సభ్యులను పరుగులు పెట్టించిన ఎలుక!

ABN, First Publish Date - 2021-07-22T19:10:11+05:30

పార్లమెంట్ భవనంలో ఎలుక హల్‌చల్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అండలూసియా, స్పెయిన్: పార్లమెంట్ భవనంలో ఎలుక హల్‌చల్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్పెయిన్‌లోని అండలూసియా ప్రాంతీయ పార్లమెంట్ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశం జరుగుతున్న సమయంలో సభ్యుల మధ్య ఓ ఎలుక ప్రత్యక్షమైంది. అంతే.. దాన్ని చూసిన పార్లమెంట్ సభ్యులు అరుపులతో పార్లమెంట్‌ను హోరెత్తించారు. సభ్యుల్లో కొందరు భయంతో కేకలు వేయగా.. మరికొందరు పరుగు అందుకున్నారు. ఇక సభ్యుల అరుపులతో భయపడిపోయిన ఎలుక కొద్దిసేపటి తర్వాత మెల్లగా అక్కడి నుంచి బయటకు జారుకుంది. ఇలా ఎలుక ఆ పార్లమెంట్‌ సమావేశానికి కొద్దిసేపు అంతరాయం కలిగించింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజట్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.    


(Video Credit to: Reuters)

Updated Date - 2021-07-22T19:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising