ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Deepika Kumari: ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆటో డ్రైవర్ ఎవరి తండ్రో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-07-26T00:40:40+05:30

ఆమె భారత్ పరువు నిలబెట్టేందుకు విశ్వవేదికపై గురిచూస్తోంది. భర్త కూడా ఆ పక్కనే ఆమెతోపాటు అలాంటి భారమే మోస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమె భారత్ పరువు నిలబెట్టేందుకు విశ్వవేదికపై గురిచూస్తోంది. భర్త కూడా ఆ పక్కనే ఆమెతోపాటు అలాంటి భారమే మోస్తున్నాడు. కానీ ఆమె తండ్రి మాత్రం కుటుంబ భారం మోయడం కోసం మూడు చక్రాల ఆటో నడుపుకుంటున్నాడు. ఇదంతా టోక్యో ఒలింపిక్స్‌లో చైనీస్ తైపీ జోడీపై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన మహిళా ఆర్చర్ దీపికా కుమారి గురించే. భారత్ నుంచి ఆర్చరీ విభాగంలో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఏకైక మహిళ దీపికానే. ఆమె భర్త కూడా ఆర్చరీలోనే ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. తాజాగా మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రవీణ్ జాదవ్‌తో కలిసి దీపికా చైనీస్ తైపీ జంటపై గెలిచింది. అంతకు ముందే మహిళల విభాగంలో కూడా 9వ స్థానంలో నిలిచిందీ ఆర్చర్.


మహిళల ఆర్చరీ విభాగంలో భారత్ టోక్యోలో పోటీ పడుతున్న దీపిక తండ్రి మాత్రం జార్ఖండ్ రాజధాని రాంచీకి పది కిలోమీటర్ల దూరంలోని ఊళ్లో ఆటో నడుపుకుంటున్నాడు. కుమార్తె గురించి, వారి జీవన విధానం గురించి ఆయన్ను ప్రశ్నిస్తే.. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు దీపిక తండ్రి శివనారాయణ మహతో. కుటుంబాన్ని పోషించడం కోసమే తాను ఆటో నడుపుతున్నానని చెప్తున్న ఆయన.. తన కుటుంబం కూడా తనకు అండగా ఉందని చెప్పారు. తన కుమార్తె దీపిక, అల్లుడు అతాను దాస్ ఇద్దరూ బంగారు పతకం గెలిచి దేశం పరువు నిలబెట్టాలని ఆశించారు. ‘‘ఏ పనీ చిన్నది కాదు. ఈ పని చేస్తున్నందుకు నేనెప్పుడూ సిగ్గుపడలేదు. నా కూతురు ఒలింపిక్స్ వెళ్లడంలో ఈ ఆటో పాత్ర కూడా చాలానే ఉంది. అందుకే నేను ఈ పని మానదలచుకోలేదు’’ అని నమ్మకంగా చెప్పారు మహతో.

Updated Date - 2021-07-26T00:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising