ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కూతురిని క్షమించండి.. భారత్‌లోకి రానివ్వండి.. ఓ తల్లి విన్నపం.. ఇంతకీ ఆ యువతి ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2021-07-27T17:49:38+05:30

`నా కూతురిని క్షమించండి.. ఆమె నాలుగేళ్ల పాపకు తల్లి.. ఆమెను భారత్‌లోకి అనుమతించండి..` అంటూ కేరళ హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`నా కూతురిని క్షమించండి.. ఆమె నాలుగేళ్ల పాపకు తల్లి.. ఆమెను భారత్‌లోకి అనుమతించండి..` అంటూ కేరళ హైకోర్టులో బిందు సంపత్ అనే మహిళ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. కూతురు, మనవరాలు గురించి పోరాటం చేస్తూ ఆమె గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా హెబియస్ కార్పస్ పిటీషన్‌ను వెనక్కి తీసుకుని రిట్ పిటీషన్ వేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరేందుకు అఫ్గానిస్థాన్ వెళ్లిన నిమిష అలియాస్ ఫాతిమా తల్లే ఈ బిందు సంపత్.


హిందూ స్త్రీ అయిన నిమిష వివాహం తర్వాత ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అనంతరం భర్తతో కలిసి నిషేధిత ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరేందుకు 2016లో అఫ్గాన్‌లోని ఖోరాసన్ ప్రావిన్స్‌కు వెళ్లింది. మూడేళ్ల అనంతరం 2019లో ఇతర మహిళలతో కలిసి ఫాతిమా కూడా అఫ్గాన్ అధికారుల ముందు లొంగిపోయింది. అప్పటికి ఆమె ఏడాది చిన్నారికి తల్లి. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు. ఆ ఇద్దరూ ప్రస్తుతం ఆఫ్గాన్ జైళ్లో ఉన్నారు. తన కూతురిని, మనవరాలిని భారత్‌కు తీసుకొచ్చేందుకు బిందూ సంపత్ పోరాటం చేస్తున్నారు. 


ఇతర ఖైదీలతో పాటు ఫాతిమాను కూడా భారత్‌కు పంపేందుకు అఫ్గాన్ ప్రభుత్వం సుముఖంగానే ఉన్నా కేంద్రం మాత్రం వారిని అనుమతించేందుకు నిరాకరిస్తోంది. కాగా, తన కూతురు, మనవరాలిని వెనక్కి తీసుకొచ్చే క్రమంలో తాను కేంద్ర మంత్రులను, హోం శాఖ అధికారులను, మానవ హక్కుల కమిషన్‌ను కలిశానని, అయితే వారు తనకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని తన తాజా పిటీషన్‌లో బిందు పేర్కొన్నారు. తన కూతురు, మనవరాలు దేశ రక్షణకు ఎలాంటి విఘాతాలు కలిగించరని ఆమె తెలిపారు. ఫాతిమాను, ఆమె కూతురిని తిరిగి వెనక్కి రప్పించే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె పిటీషన్ దాఖలు చేశారు.

Updated Date - 2021-07-27T17:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising