ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో పోలీసుల ట్రోలింగ్.. అవార్డ్ ఇవ్వాలంటున్న నెటిజన్లు..!

ABN, First Publish Date - 2021-04-17T23:38:39+05:30

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం.. పోలీసులకు చిక్కుతామనుకుంటే జర్రున జారుకోవడం.. కొందరికీ ఇది పరిపాటే..! భలే తప్పించుకున్నాం.. అని ఇటువంటి వారు సంబరపడతారే తప్ప తప్పు చేశామన్న పశ్చాత్తాపం మాత్రం వారిలో కనిపించదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం.. పోలీసులకు చిక్కుతామనుకుంటే జర్రున జారుకోవడం.. కొందరికీ ఇది పరిపాటే..!  భలే తప్పించుకున్నాం.. అని ఇటువంటి వారు సంబరపడతారే తప్ప తప్పు చేశామన్న పశ్చాత్తాపం మాత్రం వారిలో కనిపించదు. ఎవరికి తెలుసులే అని తమకు తాము సద్దిచెప్పుకుంటూ మళ్లీ పాత పంథాలోనే నడుస్తుంటారు. అయితే.. ఇది కొత్త జమానా. ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. మనల్ని నిరంతరం గమనిస్తుంటాయి. వాటి కంటికి ఎప్పుడో ఒకప్పుడు చిక్కక తప్పదు. ఇక సోషల్ మీడియా ఎటూ ఉంది కాబట్టి ఈ వీడియోలు వైరల్ అవ్వకా తప్పదు. ఇటువంటి టక్కరి దొంగలను కేరళ పోలీసులు ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ బుద్ధి చెప్పారు. ఇందుకు సంబంధించి వారు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది!


ఆ ఫన్నీ వీడియోలో ఏముందంటే..

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓకే స్కూటీపై ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా.. ఎదురుగా పోలీస్ వ్యాన్‌ను వస్తున్నట్టు వారు దూరం నుంచే గమనిస్తారు. ఆ తరువాతే అసలు కామెడీ మొదలవుతుంది. అందరికంటే వెనుక కూర్చు వ్యక్తి ఒక్క ఉదుటున స్కూటీ దిగి వెనక్కు పారిపోయాడు. స్కూటీ నడుపుతున్న వ్యక్తి యూటర్న్ తీసుకుని జంపైపోతాడు. ఇక మధ్యలో కూర్చున్న వ్యక్తి మాత్రం పోలీసులనే పల్టీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. మిగితా ఇద్దరూ పారిపోతే..ఇతగాడు మాత్రం మాస్కు పెట్టుకుని ఏమీ జరగనట్టు నింపాదిగా నడుస్తూ తనకేమీ తెలియదనే కలరింగ్ ఇచ్చేందుకు ట్రై చేశాడు. రోడ్డు పక్కన నడస్తున్న అతడిని పోలీసులు ఆపి ప్రశ్నించినా కూల్‌గా సమాధానాలు చెబుతూ అదే నాటకం ఆడాడు. మరి ఎదురుగా ఉన్నది పోలీసులు ఆయే.. పెద్ద పెద్ద కేటుగాళ్లను పట్టుకునే వారికి అక్కడ ఏం జరిగిందో తెలియదా..? అందుకే..స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలను మొత్తం ఫేస్‌బుక్‌లో పెట్టి ఆ ముగ్గురినీ సరదాగా ట్రోల్ చేశారు. బాబూ..తప్పుచేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు అంటూ చిన్న క్యాప్షన్ కూడా జత చేస్తారు. 44 వేల లైకులు తెచ్చుకున్న ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ సీన్‌లో తెగ యాక్టింగ్ చేసిన ‘రియల్ స్టార్‌’ను చూసి నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. అతడికి కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందేనంటూ కామెంట్ చేస్తున్నారు. 



Updated Date - 2021-04-17T23:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising