ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పుడు ఆయన నా భర్త.. మాకు ఓ బిడ్డ కూడా.. ఆ అత్యాచారం కేసు కొట్టేయండని హైకోర్టుకు వెళ్లిన యువతికి ఊహించని షాక్..!

ABN, First Publish Date - 2021-11-24T18:28:47+05:30

తన భర్తపై గతంలో తను పెట్టిన అత్యాచారం కేసును కొట్టెయ్యాలని పిటిషన్ వేసిన మహిళకు కర్ణాటక హై కోర్టు షాకిచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన భర్తపై గతంలో తను పెట్టిన అత్యాచారం కేసును కొట్టెయ్యాలని పిటిషన్ వేసిన మహిళకు కర్ణాటక హై కోర్టు షాకిచ్చింది. ఆ కేసును కొట్టెయ్యడం కుదరదని స్పష్టం చేసింది. బాధిత మహిళ మైనర్‌గా ఉన్నప్పుడు నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి బాధిత మహిళను వివాహం చేసుకున్నాడు. 


వారిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉన్నాడు. దీంతో బాధిత మహిళ కేసును ఉపసంహరించుకోవాలనుకుంది. ప్రస్తుతం విజయపుర జిల్లా బసవన బాగేవాడి ప్రత్యేక కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతోంది. ఆ కేసు విచారణను రద్దు చేయాలని, నిందితుడు ఇప్పుడు తన భర్త అని, తమకు ఓ బిడ్డ కూడా ఉందని బాధిత మహిళ హై కోర్టును ఆశ్రయించింది. అలాగే అత్యాచార ఘటన జరిగినపుడు తన వయసు 19 సంవత్సరాలని, ఫిర్యాదులో పేర్కొన్నట్టు తాను మైనర్‌ కాదని పిటిషన్‌లో పేర్కొంది. 


ఈ పిటిషన్‌ను జస్టిస్ హెచ్‌పీ సందేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 376 ప్రకారం ఒక మైనర్‌తో ఆమె అనుమతితోనే శృంగారం సాగించినా అది నేరంగానే పరిగణించబడుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో బాధిత మహిళ మైనరా? కాదా? అనే విషయం ట్రయల్ కోర్టులో తేలాల్సి ఉందన్నారు. 

Updated Date - 2021-11-24T18:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising