ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి.. రాచరిక హోదా గోవిందా!

ABN, First Publish Date - 2021-10-26T23:17:22+05:30

జపాన్ యువరాణి మాకో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మంగళవారం ఓ సామాన్యుడిని వివాహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: జపాన్ యువరాణి మాకో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మంగళవారం ఓ సామాన్యుడిని వివాహం చేసుకున్నారు. నిజానికి మూడేళ్ల క్రితమే వారి వివాహం జరగాల్సి ఉండగా తల్లితో ఆర్థికపరమైన వివాదాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కీ కొమురోను పెళ్లాడిన యువరాణి మాకో తన రాచరిక హోదాను కోల్పోయారు.


జపాన్‌ చట్టం ప్రకారం మహిళలు తమ వివాహం తర్వాత సొంత ఇంటి పేరును తప్పనిసరిగా వదిలివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యువరాణి మాకో పేరు ఇకపై మాకోకొమురోగా మారిపోనుంది. మాకో వివాహ ధ్రుపత్రాన్ని ఈ ఉదయం ప్యాలెస్ అధికారులు సమర్పించారు.


ఫలితంగా వారి వివాహం అధికారికమైనట్టు ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ తెలిపింది. వారికి వివాహానికి సంబంధించి ఎలాంటి విందు కానీ, ఇతర వివాహ ఆచారాలు కానీ నిర్వహించలేదని పేర్కొంది. వారి వివాహాన్ని ఎవరూ ఆహ్వానించడం లేదని తెలిపింది. 


ఈ సందర్భంగా మాకో మాట్లాడుతూ.. తన వరకు చెప్పాలంటే కీ ఓ వెలకట్టలేని వ్యక్తి అని అభివర్ణించారు. తమ హృదయాలను మరింత దగ్గర చేసుకునేందుకు తమ వివాహం ఒక అవసరమైన ఎంపిక అని ఓ టీవీ న్యూస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.


కొమురో మాట్లాడుతూ.. తనకు మాకో అంటే ఎంతో ఇష్టమని, ఈ జీవితాన్ని ఆమె ప్రేమలో గడిపేయాలని ఉందని అన్నారు. కష్టసుఖాల్లో భావాలను పంచుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మాకోతో కలిసి ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. 


నరుహిటో చక్రవర్తి మేనకోడలు అయిన 30 ఏళ్ల మాకో టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొమురో ఆమెకు క్లాస్‌మేట్. అలా వారిద్దరికీ పరిచయం అయింది. వచ్చే ఏడాది తాము వివాహం చేసుకుంటామని సెప్టెంబరు 2017లో మాకో ప్రకటించారు. అయితే, తల్లితో ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా వివాహం వాయిదా పడుతూ వచ్చింది.


తాజాగా ఈ ఉదయం రాజమహల్‌ను విడిచిపెట్టిన మాకో.. కొమురోను వివాహం చేసుకున్నారు. రాజకుటుంబాన్ని విడిచిపెడుతున్నందుకు ఆమెకు రావాల్సిన 140 మిలియన్ యెన్‌ (1.23 మిలియన్ డాలర్లు)లను మాకో తిరస్కరించారు. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చెల్లింపును వదులుకున్న రాజకుటుంబానికి చెందిన తొలి వ్యక్తిగా మాకో రికార్డులకు ఎక్కారు. వివాహంపై విమర్శల నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-26T23:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising