ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ ఇంట్లో లేనప్పుడు అన్నయ్య అత్యాచారం చేశాడంటూ చెల్లి కేసు.. రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్..

ABN, First Publish Date - 2021-09-02T01:34:45+05:30

చెల్లే కేసు పెట్టడంతో రెండేళ్ల పాటు జైలు పాలైన అన్న.. కేసులో ఊహించని ట్విస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తల్లి ఇంట్లో లేనప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి తన అన్నపై కేసు పెట్టింది. దీంతో..ఆ యువకుడి జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతడు రెండేళ్ల పాటు జైల్లోనే మగ్గిపోయాడు. తాజాగా ఆమె ఈ కేసుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో.. యువకుడికి విముక్తి లభించింది. అయితే.. అతడి జీవితంలో రెండేళ్ల విలువైన కాలం కటకటాల్లోనే కాలిపోయింది. ఆ యువకుడిపై వచ్చిన అన్ని ఆరోపణలను కొట్టేస్తూ దిన్‌దోషీలోని ప్రత్యేక న్యాయస్థానం ఇటీవలే తీర్పు వెలువరించింది. అసలు ఏం జరిగిందంటే..


2019లో యువతి ఫిర్యాదు చేయడంతో ఆమె అన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో ఆమె మైనర్ అన్న వాదన కూడా తెరపైకి రావడంతో యువకుడిపై పోక్సో చట్టం కింద కూడా కేసు దాఖలైంది. దీంతో అతడు రెండేళ్ల పాటు జైల్లోనే గడిపాడు. తాజాగా ఆమె అసలు నిజం చెప్పేందుకు ముందుకు వచ్చింది. ఆ రోజు తాను బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లడంతో అన్నయ్య తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, చేయి కూడా చేసుకున్నాడని పేర్కొంది. దీంతో..అతడిపై ఇలా ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది.


ఈ క్రమంలో.. దర్యాప్తు అధికారి, యువతి చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం యువకుడు నిర్దోషి అంటూ తీర్పు వెలువరించింది. యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్లో పరస్పర విరుద్ధమైన పలు వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. ఘటన జరిగిన సమయంలో ఆమె మైనర్ అని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ‘‘నిందితుడితో ఉన్న బాంధవ్యం కారణంగా యువతి ఈ కేసు మరింత ముందుకెళ్లేందుకు అంగీకరించి ఉండేది కాదు. ఆమె ఇలా నమ్మశక్యం కానీ పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం, పూర్తి ఆధారాలు అందుబాటులో లేకపోవడం కారణంగా ముద్దాయిపై మోపిన నేరం రుజువు కాలేదు’’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-02T01:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising