ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో డ్రైవర్‌కు చావును చూపించిన పనసకాయ... అదృష్టం అంటిపెట్టుకోవడంతో...

ABN, First Publish Date - 2021-08-10T13:28:09+05:30

చావు అనేది ఎప్పుడు, ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటుందో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: చావు అనేది ఎప్పుడు, ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అలాగే అది తృటిలో తప్పిపోవడాన్ని కూడా ఎవరూ ఊహించలేం. ఒక ఆటో డ్రైవర్‌కు మృత్యువు పనసకాయ రూపంలో ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే కర్నాటకలోని కపిక్కడ్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల ఆటో డ్రైవర్ సుదర్శన్ విచిత్రమైన పరిస్థితిలో తీవ్రంగా గాయపడ్డాడు.


సుదర్శన్ ఆటోలో మధురావెలీ-కురుప్పనాథ్ రోడ్డు మీదుగా వెళుతున్నాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న పనస చెట్టుపై నుంచి ఒక భారీ పనసకాయ ఆటో టాప్‌ను చీల్చుకుంటూ వచ్చి, అతని నెత్తిపై పడింది. వెంటనే సుదర్శన్ గిలగిలా తన్నుకుంటూ, రోడ్డుపై పడిపోయాడు. ఆ సమయంలో అతని ఆటోలో ఎవరూ లేరు. సుదర్శన్‌ను గమనించిన స్థానికులు వెంటనే అతనిని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు బాధితునికి ప్రాణాపాయం లేదని, చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-08-10T13:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising