ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమెకు రెండో పెళ్లి.. వేడుక తర్వాత టెర్రస్‌పై పడుకుంటానని వెళ్లిన భర్త.. తెల్లారేసరికి ఊహించని సంఘటన

ABN, First Publish Date - 2021-07-17T02:35:48+05:30

ఆ యువతి రెండో పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఒక్కటైన ఈ దంపతులు తాజాగా ఇంట్లో సంప్రదాయం ప్రకారం వరమాల కార్యక్రమం జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి రెండో పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఒక్కటైన ఈ దంపతులు తాజాగా ఇంట్లో సంప్రదాయం ప్రకారం వరమాల కార్యక్రమం జరుపుకున్నారు. వేడుక తర్వాత ఇంటిపై పడుకుంటానని వెళ్లాడా భర్త. తెల్లారేసరికి ఎవరూ ఊహించని ఘటన వెలుగు చూసింది. టెర్రస్‌పైకి వెళ్లి చూసిన కుటుంబీకులకు రక్తపు మడుగులో ఉన్న యువకుడు కనిపించాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఘోరట్ గ్రామంలో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే రఘురాజ్ కుశావహ (28) ఇటీవలే కృష్ణ అనే యువతితో జరిగింది. ఈ క్రమంలోనే సంప్రదాయం ప్రకారం, గురువారం నాడు ఇంట్లో వరమాల కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబీకులతోపాటు, గ్రామస్థులు కూడా హాజరయ్యారు. ఉత్సాహంగా వేడుక చేసుకున్న అనంతరం అందరూ నిద్రకుపక్రమించారు.


అప్పుడే తాను టెర్రస్‌పై పడుకుంటానని రఘురాజ్ వెళ్లాడు. ఆ మరుసటి రోజు అతన్ని నిద్రలేపడానికి వెళ్లిన వారికి రక్తపు మడుగులో పడి ఉన్న రఘురాజ్ మృతదేహం కనిపించింది. పదునైన ఆయుధంతో అతని గొంతు కోసేసినట్లు కనిపించింది. దీంతో భోరుమన్న కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. దుండగుడు ఇంటి వెనుక ద్వారం గుండా ఇంట్లో ప్రవేశించి, టెర్రస్‌పైకి చేరుకున్నాడని అనుమానిస్తున్నారు. అక్కడే పడుకొని ఉన్న రఘురాజ్ గొంతుకోసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. రఘురాజ్‌ భార్య కృష్ణ మొదటి భర్తే ఈ హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-17T02:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising