ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఆకాశంలో విమానంలా దూసుకెళ్తూ.. ఈ వ్యక్తి చేసిన స్టంట్ చూశారంటే.. వావ్.. అనాల్సిందే..!

ABN, First Publish Date - 2021-11-20T00:32:38+05:30

ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి చేసిన స్టంట్.. చూసేందుకు ఆశ్చర్యంగానూ, అద్భుతంగానూ ఉంది. ఈ వీడియో చూసిన వారంతా వావ్.. శభాష్ అంటూ అతన్ని మెచ్చుకుంటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు చేసే విన్యాసాలు అనితరసాధ్యం అనిపిస్తుంటాయి. అంత ఆశ్చర్యంగా ఉంటాయి కాబట్టి.. వారికేమన్నా అతీత శక్తులేమన్నా ఉన్నాయా అనిపిస్తుంటుంది. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఇలాంటి వీడియోలు చాలా చూస్తుంటాం. అలాంటి వీడియోలకు నెట్టిజన్ల నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి చేసిన స్టంట్.. చూసేందుకు ఆశ్చర్యంగానూ, అద్భుతంగానూ ఉంది. ఈ వీడియో చూసిన వారంతా వావ్.. శభాష్ అంటూ అతన్ని మెచ్చుకుంటున్నారు..


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్క నుంచి ఉన్నట్టుండి పరుగెత్తుకుంటూ వస్తాడు. ఏం చేస్తున్నాడు అని అనుకునేలోగానే అందరినీ ఆశ్చర్యపరుస్తూ రోడ్డు పక్కన గోడపై చేతులు పెట్టి, ఒక్కసారిగా విమానం దూసుకెళ్లినట్లు వెళ్తాడు. ఆ గోడపైనుంచి దూసుకెళ్లి దూరంగా ఉన్న మరోగోడపై చేతులు మోపి.. సునాయాసంగా కిందకు దిగేస్తాడు. రెప్పపాటు కాలంలో జరిగే ఈ స్టంట్.. చూస్తే నిజంగా మన కళ్లను మనమే నమ్మం. అందుకే ఈ వీడియోను చూసిన వారంతా.. అతడిని తెగ మెచ్చుకుంటున్నారు. కొందరు మాత్రం ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అంటూ సలహా ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..



Updated Date - 2021-11-20T00:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising