ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Scuba diverకి సముద్రంలో దొరికిన ఈ కత్తి ప్రత్యేకత ఏమిటంటే....

ABN, First Publish Date - 2021-10-20T01:13:15+05:30

ఇజ్రాయెల్ స్కూబా డైవర్‌కు మధ్యదరా తీరంలో పురాతన కాలం నాటి ఖడ్గం దొరికింది. ఇది క్రుసేడర్ల కాలం నాటిదిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్కూబా డైవర్‌కు మధ్యదరా తీరంలో పురాతన కాలం నాటి ఖడ్గం దొరికింది. ఇది క్రుసేడర్ల కాలం నాటిదిగా భావిస్తున్నారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో అతను వారాంతపు డైవ్‌లో ఉన్న సమయంలో ప్రాచీన కాలం నాటి వస్తువులు లభ్యమయ్యాయని, అందులో లంగర్లు, కుండలు, మీటరు పొడవున్న కత్తి ఉన్నాయని పురాతత్వ అధికారులు తెలిపారు. తీరానికి 150 మీటర్ల దూరంలో, ఐదు మీటర్ల లోతులో ఇవి లభ్యమైనట్టు చెప్పారు. 


4 వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ప్రాచీన నౌకలకు ఆశ్రయం కల్పించిందని, పురావస్తు సంపదకు నిలయంగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ తరచూ మారుతున్న ఇసుక కారణంగా ఇలాంటివి గుర్తించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. డైవర్ తీరంలో కనుగొన్న కత్తిని ప్రభుత్వ నిపుణులు పరిశీలిస్తారని తెలిపారు.


ఈ ఆయుధం 900 సంవత్సరాల క్రితం నాటిది అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కత్తిని తొలుత శుభ్రం చేసి ఆ తర్వాత విశ్లేషిస్తామని రోబరీ ప్రివెన్షన్ యూనిట్ అథారిటీ ఇన్‌స్పెక్టర్ నిర్ డిస్టెల్‌ఫెల్డ్ తెలిపారు. కత్తిని కనుగొన్న డైవర్‌ను ష్లోమి కట్జిన్‌గా గుర్తించారు. 

Updated Date - 2021-10-20T01:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising