ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టెప్పులేస్తూ ఇలా ఆడిపాడిన ముగ్గురు యువతులకు ఊహించని కష్టం.. క్షమించమంటూ వీడియో పోస్ట్.. అసలు కథేంటంటే..

ABN, First Publish Date - 2021-12-03T18:55:34+05:30

ఆ ముగ్గురు యువతులు తమ డ్యాన్సింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అప్‌లోడ్ చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ముగ్గురు యువతులు తమ డ్యాన్సింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అప్‌లోడ్ చేశారు.. ఆ ముగ్గురిలో ఓ యువతి రియాలిటీ షో సెలబ్రిటీ కావడంతో ఆ వీడియో వైరల్ అయింది.. ఆ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.. దీంతో ఆ యువతులు ముగ్గురు తమ క్షమాపణలు తెలియజేస్తూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.. ఈ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలో జరిగింది. 


కొడగు జిల్లాలోని బ్రహ్మగిరి కొండపై ఉన్న తలకావేరి అమ్మవారి గుడి స్థానికంగా చాలా ప్రసిద్ధి. అక్కడి నుంచే కావేరి నది ఉద్భవించిందని అక్కడి వారు నమ్ముతారు. స్థానికంగా ఉండే కొడవ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఆ అమ్మవారిని ఆరాధిస్తారు. ఇటీవల ఆ గుడికి ముగ్గురు యువతులు వెళ్లి పూజలు చేశారు. అనంతరం గుడి బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు. ఆ ముగ్గురిలో ఓ యువతి రియాలిటీ షో సెలబ్రిటీ కావడంతో ఆ వీడియో వైరల్ అయింది. దీంతో కొడవ కమ్యూనిటీకి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. 


తలకావేరి అమ్మవారి గుడి ముందు వెకిలి డ్యాన్స్‌లు చేసి అవమానించారని, వెంటనే ఆ వీడియోను తొలగించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ యువతులు క్షమాపణలు చెబుతూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. తలకావేరి అమ్మవారంటే తమకు ఎంతో భక్తి ఉందని, తమ అవగాహనా రాహిత్యం వల్ల తప్పు జరిగిందని, ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-03T18:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising