ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిడ్జిపై నల్లటి బ్యాగు.. అందులోంచి శబ్దాలు.. వాహనదారుల ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి ఓపెన్ చేసి చూస్తే..

ABN, First Publish Date - 2021-10-22T00:05:01+05:30

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో నల్ల బ్యాగు కలకలం సృష్టించింది. అందులోంచి శబ్దాలు రావడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడైనా బాగు, బాక్సులు వంటివి కనబడితే.. కనీసం దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడతారు. అందులో ఏ బాంబుందో అనే భయంతో ఆమడదూరం పరుగెడతారు. తాజాగా హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో నల్ల బ్యాగు కలకలం సృష్టించింది. అందులోంచి శబ్దాలు రావడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. వివరాల్లోకి వెళితే..


ఫరీదాబాద్‌లోని సెక్టార్ 25 రోడ్డులో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సమీపంలోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే నల్లటి బ్యాగు కనిపించింది. దగ్గరకు వెళ్లగానే అందులోంచి ఏడుపులు వినిపించాయి. తెరిచి చూస్తే పసికందు కనిపించింది. షాక్‌కు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పుడే పుట్టిన పసికందును ఎవరో బ్యాగులో పడేసి వెళ్లినట్లు గుర్తించారు.


పాప ఆరోగ్యంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఎవరు వదిలేసి వెళ్లాలనే కోణంలో విచారిస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని.. పాపను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. అయితే చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయకుండా పాపను దత్తత ఇవ్వడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-22T00:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising