ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదిలో దూకిన విగ్రహాల దొంగను వెంటాడి పట్టుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-07-06T14:03:04+05:30

విగ్రహాల దొంగను పట్టుకునేందుకు అతని ఇంటికి పోలీసులు వస్తే అతను తప్పించుకునేందుకు బ్రాహ్మణి నదిలోకి దూకిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): విగ్రహాల దొంగను పట్టుకునేందుకు అతని ఇంటికి పోలీసులు వస్తే అతను తప్పించుకునేందుకు బ్రాహ్మణి నదిలోకి దూకిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. ఒడిశాలోని పట్టాముంబై పోలీసుస్టేషను పరిధిలోని దండిసాహి గ్రామ రామాలయంలోని విగ్రహాలను దొంగ భారత్ మల్లిక్ దొంగిలించాడు.నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అతని ఇంటికి వస్తే భారత్ మల్లిక్ పారిపోయేందుకు కేంద్రపారాజిల్లాలోని బ్రాహ్మణి నదిలోకి దూకాడు. నదిలో రెండు గంటలపాటు వెంటాడిన పోలీసులు నిందితుడు మల్లిక్ ను అరెస్టు చేశారు. మల్లిక్ ఇంట్లో నుంచి విగ్రహాలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


విగ్రహాల దొంగతనం కేసులో నిందితుడైన మల్లిక్ గజ ఈతగాడు కావడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అగ్నిమాపక దళ సిబ్బందిని రంగంలోకి దించి అరెస్టు చేశారు. నదిలో పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు తాము రెండు పడవలను ఉపయోగించామని సబ్ డివిజనల్ పోలీసు అధికారిణి సంధ్యారాణి బెహురియా చెప్పారు.విచారణలో తాను ఆలయం ప్రధాన తలుపు తెరచి గర్భగుడిలోకి ప్రవేశించి విగ్రహాలు చోరీ చేశానని అంగీకరించాడు.


Updated Date - 2021-07-06T14:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising