నడి రోడ్డుపై భార్య పాదాలపై పడిన భర్త... మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్య!
ABN, First Publish Date - 2021-03-16T16:44:48+05:30
పెళ్లిలో ఏడడుగులు వేసి, కలకాలం కలసి ఉంటామని...
అలీగఢ్: పెళ్లిలో ఏడడుగులు వేసి, కలకాలం కలసి ఉంటామని భార్యాభర్తలిద్దరూ ప్రమాణం చేస్తారు. అయితే ఈ ఆధునిక కాలంలో ఈ సంకల్పానికి విలువ లేకుండాపోయింది. ఇటువంటి ఉదంతం యూపీలోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. పెళ్లయిన ఒక జంట మధ్య వివాదం చోటుచేసుకుంది. భర్త తనను విడిచి వెళ్లవద్దని భార్యను వేడుకున్నాడు. ఆమె అతనిని పట్టించుకోకుండా రోడ్డమీదకు వచ్చింది. భార్యను అనుసరిస్తూ భర్త కూడా బయటకు వచ్చి భార్య పాదాలపై పడి, తనతో కలసి ఉండాలని ప్రాధేయపడ్డాడు. అయితే ఆమె అతనిని పట్టించుకోకుండా... అక్కడికి బైక్ పైన వచ్చిన యువకునితో వెళ్లిపోయింది.
వివరాల్లోకి వెళితే టప్పల్ ప్రాంతానికి చెందిని ఒక యువకుని అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో వివాహమయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే గతకొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. వీరి వివాదం కోర్టు వరకూ చేరుకుంది. ఈ నేపధ్యంలో భర్త భార్యతో తనను విడిచి వెళ్లవద్దని, పిల్లల కోసమైనా కలసి ఉండాలని వేడుకున్నాడు. అయితే ఆమె అతని మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా మరొక యువకునితో వెళ్లిపోయింది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
Updated Date - 2021-03-16T16:44:48+05:30 IST