ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యకు ‘తాజ్‌మహల్‌’ను బహుమానంగా ఇచ్చిన భర్త

ABN, First Publish Date - 2021-11-23T00:09:46+05:30

ప్రేమ పేరెత్తగానే వెంటనే గుర్తొచ్చేది తాజ్‌మహల్. ఈ భూమిపై ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయిన పాలరాతి కట్టడం అది. ప్రియురాలికో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: ప్రేమ పేరెత్తగానే వెంటనే గుర్తొచ్చేది తాజ్‌మహల్. ఈ భూమిపై ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయిన పాలరాతి కట్టడం అది. ప్రియురాలికో, ప్రియుడికో బహుమానంగా ఇచ్చేందుకో, ప్రేమను తెలియజేసేందుకో చిన్నపాటి తాజ్‌మహల్‌ బొమ్మనో, చిత్రపటాన్నో ఇవ్వడానికి మించిన గొప్ప ఏముంటుంది! అందుకే ఓ భర్త తనను ప్రాణప్రదంగా ప్రేమించే భార్యకు తాజ్‌మహల్ కట్టించి ఇచ్చేశాడు. తాజ్‌మహల్ అంటే ఆషామాషీ ఏం కాదు.. అచ్చుగుద్దినట్టు దానిని దింపేశాడు. ఓ ఫైన్‌డే ఆమెకు దానిని గిఫ్ట్ ఇచ్చేసి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. 


మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. తాజ్‌మహల్‌ను నిర్మించి ఇచ్చిన ఆ భర్త పేరు ఆనంద్ ప్రకాశ్ చోక్సీ. విద్యావేత్త. భార్య మంజూషా చోక్సీకి నాలుగు బెడ్రూములు, పెద్ద హాలు, ఓ లైబ్రరీ, ధ్యానమందిరంతో అచ్చుగుద్దినట్టు తాజ్‌మహల్‌ను పోలి ఉండే ఇంటిని కట్టించేసి ఇచ్చేశారు.


ఆగ్రా వెళ్లి దాని అందాలను చూసి మైమరిచిపోయిన ప్రకాశ్, మంజూషా దంపతులు దాని నిర్మాణాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆపై ఇంజినీర్‌ను కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తన ఇంటిని 80 అడుగుల ఎత్తుతో నిర్మించాలని ప్రకాశ్ చోక్సీ భావించారు. అయితే, అందుకు అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అప్పుడు తాజ్‌మహల్‌ను పోలిన ఇంటిని నిర్మించాలని నిర్ణయించారు.


ఈ ఇంటిని నిర్మించేందుకు చోక్సీ మొత్తం మూడేళ్లు పట్టింది. టవర్లను కూడా ఏర్పాటు చేశారు. రాజస్థాన్ ‘మక్రానా’తో ఫ్లోరింగ్‌ను తీర్చిదిద్దారు. ముంబై కళాకారులు ఫర్నిచర్‌ను రూపొందించారు. ఇంటి లోపల నగిషీ అలంకరణ కోసం బెంగాల్, ఇండోర్ నుంచి కళాకారులను రప్పించారు. మొత్తానికి అద్భుతంగా, అందంగా తీర్చిదిద్దారు. తాజమహల్‌ను తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా కట్టించేసి భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చేశారు.


పర్యాటకులెవరూ ఇప్పుడు బుర్హాన్‌పూర్ వచ్చి ఈ నయా ‘తాజ్‌మహల్’ను సందర్శించకుండా తిరిగి వెళ్లలేరని చోక్సీ చెప్పుకొచ్చారు. ఈ తాజ్‌మహల్ నిర్మించిన ఇంజినీర్ తొలుత తాజ్‌మహల్‌ను ఆ తర్వాత ఇలాంటి కట్టడమే అయిన ఔరంగాబాద్‌లోని ‘బీబీ కా మక్బారా’ను సందర్శించిన తర్వాతే ఈ ‘తాజ్‌మహల్’ను నిర్మాణానికి పూనుకోవడం విశేషం.

Updated Date - 2021-11-23T00:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising