ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్ల క్రితం పెళ్లి.. రోజూ వీడియో కాల్ చేసే చెల్లి.. ఆ రోజు మాత్రం చేయలేదు.. అన్నకు డౌట్.. ఆమె ఇంటికి వెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2021-12-11T20:25:50+05:30

కూతురికి పెళ్లి వయసు రావడంతో ఓ అబ్బాయిని చూసి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. పుట్టింటిని వదిలి అత్తారింట్లో అడుగు పెట్టినప్పటికీ.. ఆమె మాత్రం తన అన్నకు రోజూ వీడియో‌కాల్ చేస్తూ బాగోగులు తెలుసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కూతురికి పెళ్లి వయసు రావడంతో ఓ అబ్బాయిని చూసి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. పుట్టింటిని వదిలి అత్తారింట్లో అడుగు పెట్టినప్పటికీ.. ఆమె మాత్రం తన అన్నకు రోజూ వీడియో‌కాల్ చేస్తూ బాగోగులు తెలుసుకునేది. ఇలా మూడేళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలోనే ఓ రోజు చెల్లి నుంచి ఆ అన్నకు ఫోన్ రాలేదు. దీంతో అతడు కంగారు పడ్డాడు. అంతేకాకుండా ఆమె అత్తగారింటికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని నవాడా ప్రాంతానికి చెందిన దేవేంద్ర సింగ్.. తన కూతురు కాజల్ కుమారిని ధీరజ్ సింగ్ అనే వ్యక్తికి ఇచ్చి 2018లో వివాహం చేశాడు. పుట్టింటిని వదిలి అత్తారింటికి అడుగుపెట్టినప్పటికీ కాజల్ కుమారి.. ప్రతి రోజూ తన అన్న గుల్షన్ కుమార్‌కు వీడియో కాల్ చేసేది. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం రోజు కాజల్ కుమారి నుంచి గుల్షన్ సింగ్‌కు ఫోన్ రాలేదు. దీంతో అతడు కంగారు పడ్డాడు. అంతేకాకుండా కాజల్ కుమారి  అత్తారింటికి వెళ్లాడు. అనంతరం అక్కడ చూసిన దృశ్యాలను చూసి షాకయ్యాడు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. 



ఆ తర్వాత తన చెల్లి ఆసుపత్రిలో ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లాడు. తీరా ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అతడికి చేదు వార్త తెలిసింది. కాజల్ కుమారి చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో అతడు కన్నీరుమున్నీరయ్యాడు. ఈ క్రమంలోనే ధీరజ్ సింగ్ అతడి తల్లిదండ్రులపై    పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కోసం తన చెల్లిలిని భర్త, అతడి తల్లిదండ్రులు వేధించారని పేర్కొన్నాడు. అన్నంలో వాళ్లే విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ధీరజ్ సింగ్, అతడి తల్లిదండ్రుల కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. 




Updated Date - 2021-12-11T20:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising