ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్: పక్షుల కళేబరాలతో నిండిపోయిన వీధులు! కారణం తెలిస్తే..

ABN, First Publish Date - 2021-01-02T21:54:39+05:30

కొత్త ఏడాదిని స్వాగతిస్తూ వేడుకల పేరిట మనుషులు చేస్తున్న ఆర్భాటాలు మూగజీవాల ప్రాణాలు హరిస్తున్నాయి. కొత్త ఏడాది తొలి రోజునే ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఆవిష్కృతమైన దారుణ దృశ్యమే ఇందుకు తార్కాణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఏడాదిని స్వాగతిస్తూ వేడుకల పేరిట మనుషులు చేస్తున్న ఆర్భాటాలు మూగజీవాల ప్రాణాలు హరిస్తున్నాయి. కొత్త ఏడాది తొలి రోజునే ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఆవిష్కృతమైన దారుణ దృశ్యమే ఇందుకు తార్కాణం. అక్కడి వీధులు కొన్ని పక్షుల కళేబరాలతో నిండిపోయాయి. వందల సంఖ్యలో చచ్చిపడ్డ పక్షలతో అక్కడి వీధులు వద్యశాలను తలపించాయి. ఈ దారుణ దృశ్యానికి కారణం..బాణా సంచా..! కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ సంబురాల్లో మునిగిపోయిన ప్రజలు.. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చడంతో పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. 


బాణా సంచా చప్పుళ్లకు భయపడిపోయి కొన్ని ప్రాణాలు విడిస్తే..కాలుష్యం కారణంగా మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఈ ఘటనను సామూహిక జంతు వధగా వారు అభిర్ణిస్తున్నారు. వాస్తవానికి రోమ్ నగరంలో బాణా సంచాపై నిషేధం ఉంది. జంతువులు, మనుషుల ఆరోగ్యం దృష్ట్యా అక్కడి ప్రభుత్వం గతంలోనే ఈ నిషేధం విధించింది. అయితే..వేడుకల హడావుడిలో పడి ప్రజలు ఈ ఉత్తర్వులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పెద్ద చప్పుళ్లతో బాణా సంచా కాల్చి..వందల కొద్ది పక్షుల మరణానికి కారణమయ్యారని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-01-02T21:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising