ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సింపుల్ ట్రిక్స్‌తో గ్యాస్ సిలిండర్‌లో ఇంకా గ్యాస్ ఎంత ఉందో చెక్ చేస్కోండి.. రూపాయి కూడా ఖర్చు లేకుండానే..

ABN, First Publish Date - 2021-12-16T21:49:28+05:30

గ్యాస్ సిలిండర్ ఒక్కోసారి సడన్‌గా అయిపోతూ ఉంటుంది. వంట చేస్తూండగా మధ్యలోనే ఆగిపోతుంది. మూడు నెలలు వస్తుందని అంచనా వేసుకుంటే కనీసం రెండు నెలలు కూడా రాకుండానే మధ్యలోనే నిలిచిపోతుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్యాస్ సిలిండర్ ఒక్కోసారి సడన్‌గా అయిపోతూ ఉంటుంది. వంట చేస్తూండగా మధ్యలోనే ఆగిపోతుంది. మూడు నెలలు వస్తుందని అంచనా వేసుకుంటే కనీసం రెండు నెలలు కూడా రాకుండానే మధ్యలోనే నిలిచిపోతుంది. అలాంటి సమయాల్లో గృహిణులు ఆందోళన చెందుతూ ఉంటారు. అదనంగా ఇంకో గ్యాస్ సిలిండర్ లేనప్పుడు చాలా టెన్షన్ పడుతుంటారు. ఉన్నపళంగా గ్యాస్ అయిపోతో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్యాస్ ఎలా అయిపోతుందో ముందుగానే తెలుసుకోవడం ఎలా? గ్యాస్ ఎంత ఉందో ముందుగానే ఎలా తెలుస్తుంది.? మన గ్యాస్ సిలిండర్ నుంచి మనకు ఎంత గ్యాస్ వస్తుందో నెంబర్‌తో సహా తెలుసుకునే టెక్నిక్ ఉంది. రూపాయి కూడా ఖర్చు లేకుండానే సింపుల్ ట్రిక్‌తో గ్యాస్ సిలిండర్‌లో ఇంకా గ్యాస్ ఎంత ఉందో చెక్ చేయొచ్చు. అదెలా అంటే...


బండలో 14.2 కేజీల గ్యాస్ ఉంటుంది. వంట చేస్తుండగా ఎప్పుడు అయిపోతుందో తెలియదు. మనం గ్యాస్ బండ వాడుతున్నప్పుడే అందులో ఇంకెంత గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి బండ మీద చల్లని నీళ్లు వేసి రెండు నిమిషాలు వేచి చూడాలి. రెండు నిమిషాల తర్వాత చూస్తే గ్యాస్ ఎంతుందో తెలిసిపోతుంది. గ్యాస్ ఎంత వరకు ఉందో అంత వరకు తడిగా ఉంటుంది. గ్యాస్ లేని దగ్గర మాత్రం పొడిగా ఉంటుంది. అంటే తడి ఎంత వరకు ఆరిపోయిందో అంత వరకు గ్యాస్ అయిపోయిందని ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అలాగే తడి ఎంత వరకు ఉందో అంత వరకు గ్యాస్ ఉన్నట్లు తెలుసుకోవచ్చు. దీనిని బట్టి గ్యాస్ ఇంకెంత కాలం వస్తుందో సులువుగా తెలుసుకోవచ్చు. దీనితో పాటు మరొక సాధనం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.  బండలో గ్యాస్ ఎంతుందో తెలుసుకునే రెగ్యులేటర్ కూడా అందుబాటులో ఉంది. దానిని బండకు తగిలిస్తే పూర్తిగా గ్యాస్ ఎంతుందో మీటర్‌ను బట్టి చెప్పుస్తోంది. ఇలాంటి టెక్నిక్‌లతో గ్యాస్ అయిపోకుండానే ముందుగానే జాగ్రత్త పడొచ్చు.


ఇదిలా ఉంటే గ్యాస్ వృధా కాకుండా మరిన్ని రోజులు రావాలంటే ఈ చిట్కాలు కూడా పాటిస్తే ఆందోళన చెందక్కర్లేదు. అదెలా అంటే సిల్వర్ పాత్రల్లో వంట చేస్తే హీట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్ త్వరగా అయిపోతుంది. అదే స్టీల్ పాత్రల్లో వంట చేస్తే గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది. స్టీల్ పాత్రల్లో వేడి ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి దీనిని బట్టి గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. అలాగే కుక్కర్లో కూడా వంట చేసినా గ్యాస్ సేవ్ చేయొచ్చు. ఇలా చిట్కాలు పాటిస్తూనే.. గ్యాస్ ఎంతుందో తెలుసుకునేందుకు ట్రిక్‌లు పాటిస్తే ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరమే ఉండదు.

Updated Date - 2021-12-16T21:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising