ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే జరిగితే లీటర్ పెట్రోల్ ధర 57 రూపాయలు మాత్రమే..!

ABN, First Publish Date - 2021-09-17T17:51:09+05:30

పెట్రోల్, డీజిల్ ధరలు కొండ దిగి రానున్నాయా? పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌ చర్చించే అవకాశం ఉందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెట్రోల్, డీజిల్ ధరలు కొండ దిగి రానున్నాయా? పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌ చర్చించే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరికొద్ది గంటల్లో తెలియనున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం లక్నోలో జరగనుంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం గురించి కేంద్రం చర్చించనున్నట్టు సమాచారం. అదే జరిగితే లీటర్ పెట్రోల్ ధర రూ.57కు దిగి వచ్చేస్తుంది.


ఇవి కూడా చదవండి

మద్యం సేవించి ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగికి భారీ నష్టపరిహారం 



నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కాదు.. కోర్టుకెక్కిన ఓ భర్త.


పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలంటూ జూన్‌ నెలలో కేరళ హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న జీఎస్టీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా, కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు వర్చువల్‌గానే జరుగుతున్నాయి. దాదాపు 20 నెలల తర్వాత తొలిసారి ఈ రోజు ప్రత్యక్షంగా జీఎస్టీ సమావేశం జరగనుండటం విశేషం. చివరిసారి 2019 డిసెంబర్‌ 18న ప్రత్యక్ష పద్ధతిలో జీఎస్టీ సమావేశం జరిగింది.


ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ బేస్ ధర రూ. 40.78. రవాణా ఛార్జీలతో కలిపి డీలర్ వద్దకు చేరే సరికి రూ. 41.10 అవుతుంది. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ప్రాథమిక ధర ఇది. దీనికి రూ.32.90 ఎక్సైజ్ డ్యూటీ (కేంద్ర పన్ను), డీలర్ కమీషన్ రూ.3.84, వ్యాట్ (రాష్ట్ర పన్ను) రూ.23.35 జోడించడం ద్వారా ఢిల్లీలో పెట్రోల్ రిటైల్ అమ్మకం ధర రూ. 101.19 అవుతోంది. ఇప్పుడు, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ఎక్సైజ్ సుంకం (కేంద్రం వాటా), వ్యాట్ (వాటా) రద్దు అవుతాయి. దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తులపై 28% జీఎస్టీ అమలైతే..  పెట్రోల్ మూలధర+ జీఎస్టీ+డీలర్ కమీషన్.. మొత్తం రిటైల్ పెట్రోల్ ధర రూ. 56.44కి తగ్గుతుంది.

Updated Date - 2021-09-17T17:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising