ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడిని మింగేసిన మొసలి.. గ్రామస్థులు దాని పొట్టను నిలువునా చీల్చి..

ABN, First Publish Date - 2021-03-07T21:45:55+05:30

ఆ చిన్నారి నదీతీరం వద్ద నత్తగుల్లలు ఏరుకుంటున్నాడు.. ఇంతలో హటాత్తుగా ఓ మొసలి కన్ను అతడిపై పడింది. ఆ బాలుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో అతడిపై దాడి చేసింది. కాలు పట్టి నీళ్లలోకి లాగింది. అంతా క్షణకాలంలో జరిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నారి నదీతీరం వద్ద నత్తగుల్లలు ఏరుకుంటున్నాడు.. ఇంతలో హటాత్తుగా..ఓ భారీ మొసలి కన్ను అతడిపై పడింది. ఆ బాలుడు(14) ఏమరపాటుగా ఉన్న సమయంలో అతడిపై దాడి చేసింది. కాలు పట్టి నీళ్లలోకి లాగింది. అంతా క్షణకాలంలో జరిగిపోయింది. ఇండోనేషియాలోని కుచింగ్ ప్రాంతంలో బుధవారం నాడు జరిగిన దారుణం ఇది. కాగా.. సమీపంలోనే ఉన్న బాలుడి మేనత్త వెంటనే అప్రమత్తమై అతడికి సాయం చేసేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఈ క్రమంలో ఆమె ఇతరులను అప్రమత్తం చేసింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. 


దీంతో..వారందరూ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు. అందరిలోనూ ఏదో ఆశ.. బాలుడి బతికే ఉన్నాడేమో.. కొనఊపిరితోనైనా తమ కంటపడతాడేమో అని. ఈ లోపు.. మరి కొందరు మొసలి కోసం వేట ప్రారంభించారు. ఓ కోడిని ఎరగా వేశారు. మూడు రోజుల అనంతరం వారికి మొసలి చిక్కింది. వారు దాన్ని తాళ్లతో బంధించి ఒడ్డుకు ఈడ్చుకొచ్చారు.  దాని పొట్టను నిలువునా చీల్చి చూశారు..! అప్పటివరకూ వారిలో మిణుకుమిణుకు మంటున్న ఆశ కూడా ఆవిరైపోయింది. బాలుడి మాంసఖండాలు, ఎముకలు దుస్తులు మొసలి పొట్టలో కనిపించాయి. వాటిని గ్రామస్థులు బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. మొసలి పొట్ట కోస్తుండగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-03-07T21:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising