ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెక్కిళ్లు అసలు ఎందుకు వస్తాయి..? ఆగకుండా 48 గంటల పాటు వెక్కిళ్లు వస్తూనే ఉంటే..

ABN, First Publish Date - 2021-12-22T22:26:14+05:30

వెక్కిళ్లు ఎప్పుడు.. ఎలా వస్తాయో తెలియదు. జీవితంలో ఏదొక సమయంలో వెక్కిళ్లు వస్తుంటాయి. కొంత మందికి తరుచుగా ప్రభావం చూపిస్తుంటాయి. వచ్చాయంటే కంటిన్యూగా వస్తుంటాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెక్కిళ్లు ఎప్పుడు.. ఎలా వస్తాయో తెలియదు. జీవితంలో ఏదొక సమయంలో వెక్కిళ్లు వస్తుంటాయి. కొంత మందికి తరుచుగా ప్రభావం చూపిస్తుంటాయి. వచ్చాయంటే కంటిన్యూగా వస్తుంటాయి. ఆగకుండా వెక్కిళ్లు వస్తే భయం కల్గుతుంది. కొంత మందికి వేగంగా తినేటప్పుడు వెక్కిళ్లొస్తే.. మరికొందరికి నవ్వడం వల్ల.. ఇంకొందరికి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెక్కిళ్లు వస్తుంటాయి. అసలు ఏ కారణం లేకుండా కూడా వెక్కిళ్లు వస్తుంటాయి. ఇలా వెక్కిళ్లు రాగానే ఎవరికి తోచిన విధంగా వారు సలహాలు ఇస్తుంటారు. కొందరైతే భయపెడితే ఆగిపోతాయంటారు. మరికొందరు ఊపిరి బిగబట్టాలంటారు. నిజంగా ఈ పద్ధతులు సరైనవేనా? వెక్కిళ్లు తగ్గడానికి ఈ ట్రిక్స్ పనిచేస్తాయా? మరి ఏం చేస్తే తగ్గుతాయి. అసలెందుకు ఇలా జరుగుతుంది. దీనికి గల కారణాలేంటో తెలుసుకుందాం.


వెక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. వెంటనే ఊపరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. ఫలితంగా స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోవడం వల్ల వెక్కిళ్లు వస్తుంటాయి. దాదాపు 100కుపైగా శారీరకమైన కారణాలు వెక్కిళ్లకు దారితీస్తాయి. ఇక మందుల వాడకం వల్ల కూడా వెక్కిళ్లు వస్తుంటాయి. మత్తు మందులు, స్టెరాయిడ్స్, కీమోథెరపీ విధానాల వల్ల కూడా వెక్కిళ్లు వస్తుంటాయి. వెక్కిళ్లు రావడానికి ఇవే ప్రధానంగా చెప్పొచ్చు. అయితే ఇవేమి పెద్దగా అపాయాన్ని కలిగించవని చెబుతారు.


చాలా మందికి వెక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి. లేదంటే అరగంట.. ఒక గంటలో తగ్గిపోవాలి. అంతకంటే ఎక్కువ సమయం పాటు వచ్చాయంటే వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కార్బోనేటేడ్ పానీయాలు తాగడం వల్ల, అతిగా మద్యం సేవించడం, అతిగా తినడం, ఉత్సాహం లేదా భావోద్వేగ ఒత్తిడి, ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఏర్పడవచ్చు. వెక్కిళ్లు డయాఫ్రాగమ్ యొక్క అసంకల్పిత సంకోచాలు. ఉదరం నుంచి మీ ఛాతీని వేరు చేసే కండరం మరియు శ్వాస తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి సంకోచం తర్వాత మీ స్వర తంతువులు అకస్మాత్తుగా మూసివేయబడతాయి. ఇది ‘హిక్’ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. అధిక భోజనం, ఆల్కహాలిక్ లేదా కార్బోనేటేడ్ పానీయాలు లేదా ఆకస్మిక ఉత్సాహం వల్ల వెక్కిళ్లు సంభవించవచ్చు. స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ సమయం వెక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వెక్కిళ్లు అంతర్లీన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. మీ వెక్కిళ్లు 48 గంటల కంటే ఎక్కువగా ఉండి.. శ్వాస తీసుకోవడంలో సమస్యలను కలిగించేంత తీవ్రంగా ఉంటే  వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని సూచిస్తున్నారు.


వాస్తవానికి వెక్కిళ్లు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తగ్గించుకోవచ్చని చెబుతుంటారు. చిన్న చిన్న చిట్కాలతో నివారించుకోవచ్చు. అల్లం ముక్క బుగ్గ దగ్గర కొద్దిసేపు పెట్టుకుంటే తగ్గుతుంది. బెల్లం, యాలికల పొడిని వేడి నీటిలో కొద్దిసేపు మరగబెట్టి చల్లారక తాగితే వెంటనే ఉపశమనం పొందవచ్చు. చిటికెడు ఆవాల పొడిలో కొద్దిగా నెయ్యి కలుపుకుని ఆ మిశ్రమాన్ని తింటే తగ్గుతుంది. అలాగే ఒక స్పూన్ చక్కెర నోట్లో వేసుకున్నా ఫలితం ఉంటుంది. దీని వల్ల కూడా శ్వాసక్రియ రేటులో మార్పు వచ్చి వెక్కిళ్లు ఆగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలకైతే తేనె ఉపయోగించవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని గొంతులో పోసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది.

Updated Date - 2021-12-22T22:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising