ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేస్తున్న ఈ 31 ఏళ్ల మహిళకు రెండేళ్ల క్రితం పెళ్లి.. భర్త చెప్పాడని రెండుసార్లు అబార్షన్.. చివరకు..

ABN, First Publish Date - 2021-12-05T00:46:20+05:30

ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్న 31 ఏళ్ల మహిళకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త చెప్పడంతో రెండు సార్లు అబార్షన్ చేయించుకుంది. చివరకు ఏమైందంటే..

మృతురాలు సుకంఠ, మహేశ్వరన్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక సమస్యలు, అనుమానాలు, అక్రమ సంబంధాలు తదితరాల విషయంలో భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తడం చూస్తూనే ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబాల్లో సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అన్నీ సక్రమంగా ఉండడంతో పాటూ కావల్సినంత ఆస్తి ఉన్న కుటుంబంలోనూ గొడవలు, వేధింపులు ఎక్కువయ్యాయి. తమిళనాడులో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ వైద్యురాలిగా పని చేస్తున్న 31 ఏళ్ల మహిళకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త చెప్పడంతో రెండు సార్లు అబార్షన్ చేయించుకుంది. చివరకు ఏమైందంటే..


తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన సుకంఠ(31)అనే మహిళ.. దేవిపట్నం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో వైద్యురాలిగా పని చేస్తోంది. ఈమెకు స్థానిక సదయన్ వలసై గ్రామానికి చెందిన మహేశ్వరన్ అనే వైద్యుడితో 2019లో వివాహమైంది. ఇద్దరూ వైద్యులు కావడంతో వీరికి ఎలాటి ఆర్థిక సమస్యలూ లేవు. దీంతో వీరి సంసారం సాఫీగా సాగేది. ఈ క్రమంలో సుకంఠ గర్భం దాల్చింది. అయితే ఎందుకో ఏమో తెలీదు గానీ.. భర్త బలవంతం మీద అబార్షన్ చేయించుకుంది. తర్వాత కొన్ని నెలలకు మళ్లీ గర్భం దాల్చింది. కానీ విచిత్రంగా భర్త మళ్లీ అబార్షన్ చేయించుకోమని చెప్పడంతో ఆమె షాక్ అయింది. తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి కూడా అబార్షన్ చేయించుకుంది. ఈ  క్రమంలో ఢిల్లీ ఎయిమ్స్‌లో పని ఉండడంతో భార్యతో పాటు వెళ్లి, గత అక్టోబర్‌లో మళ్లీ సొంతూరికి వచ్చారు.


సొంతూరుకి వచ్చాక భర్త ప్రవర్తన పూర్తి భిన్నంగా తయారైంది. విధులకు వెళ్లకుండా రోజూ ఇంట్లోనే ఉంటూ .. భార్యను రకరకాల ప్రశ్నలతో వేధించేవాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా దాడి చేసేవాడు. వేధింపులు ఎక్కువ అవడంతో ఓ రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. అయితే వారు కూడా కూతురికే నచ్చజెప్పారు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఓ రోజు భర్త ఇంట్లో లేని సమయంలో పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. అల్లుడి వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని, అతన్ని కఠినంగా శిక్షించాలని.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు వారికి నచ్చజెప్పడంతో శాంతించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-12-05T00:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising