ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతని వయసేమో వందేళ్లు... గుండెకు మాత్రం పాతికేళ్లు... కంగుతిన్న కార్డియాలజిస్ట్!

ABN, First Publish Date - 2021-07-22T12:42:47+05:30

వందేళ్ల వయసు దాటిన ఒక సాధువు వైద్యులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఝాన్సీ: వందేళ్ల వయసు దాటిన ఒక సాధువు వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈ వయసులోనూ అతని హృదయ స్పందన 25 ఏళ్ల యువకుని మాదిరిగా ఉండటమే ఇందుకు కారణం. పైగా ఆ సాధువుకు బీపీ, మధుమేహంలాంటి సమస్యలు లేనేలేవు. కొద్ది రోజుల క్రితం రాత్రి వేళలో ఆ సాధువుకు అనారోగ్యం వాటిల్లినట్లు అనిపించిన నేపధ్యంలో... కార్డియాలజిస్ట్ అతనికి యాంజియోగ్రఫీ చేయించారు. పలితాల్లో ఆ సాధువు గుండె తీరు యువకుని మాదిరిగా ఉండటం చూసి సదరు డాక్టర్ ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే యూపీలోని సీతాపూర్ ప్రాంతానికి చెందిన చంద్రికా ప్రసాద్ ఉరఫ్ మౌనీ మహరాజ్ 1890లో జన్మించారు. ఆధార్ కార్డులో అతని డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఉంది. 


మౌనీ మహరాజ్ తన పదేళ్ల వయసులోనే బద్రీనాథ్, కేదార్‌నాథ్, అమర్‌నాథ్ తదితర తీర్థయాత్రలు చేశారు. సాత్విక ఆహారం తీసుకుంటూ జీవనం సాగించారు. 131 ఏళ్లు దాటినప్పటికీ మౌనీ మహరాజ్‌కు  ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకపోవడం విశేషం. అయితే ఈమధ్య అతనికి కొద్దిగా అనారోగ్యం అనిపించడంతో డాక్టర్ అలోక్ శర్మను సంప్రదించారు. దీంతో ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్... ఈ వయసులోనూ మౌనీ మహరాజ్ ఆరోగ్యం ఎంతో చక్కగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా డాక్టర్ అలోక్ శర్మ మాట్లాడుతూ మౌనీ మహరాజ్ ఇంత ఆరోగ్యంగా ఉండటానికి అతని సాత్విక జీవన విధానమే కారణమన్నారు. ఉదయన్నే లేవడం, వ్యాయామం చేయడం లాంటివి చేయడం అతని ఆరోగ్యాన్ని చక్కగా ఉంచాయన్నారు. అందుకే అతని హృదయ స్పందన 25 ఏళ్ల యువకుని మాదిరిగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-22T12:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising