ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

airlifted: వరదప్రాంతాల సందర్శనకు వచ్చి ఇరుక్కున్న మంత్రి

ABN, First Publish Date - 2021-08-05T13:55:51+05:30

వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చిన ఓ మంత్రి ఇరుక్కుపోవడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టరు ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేయాల్సి వచ్చిన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చిన ఓ మంత్రి ఇరుక్కుపోవడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టరు ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేయాల్సి వచ్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దటియా జిల్లాలో జరిగింది. వరదలతో అల్లాడుతున్న దటియా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా పడవలో వచ్చారు. దాటియాలోని కోట్రా గ్రామంలో వరదల్లో 9 మంది చిక్కుకున్నారని తెలుసుకున్న మంత్రి నరోత్తం మిశ్రా పడవలో వచ్చారు. వరదనీటిలో ఇల్లు మునిగిపోవడంతో రెండవ అంతస్తు టెర్రస్ మీద 9 మంది సహాయం కోసం ఎదురుచూస్తూ కనిపించారు. 


వరదలో చిక్కుకున్న 9మందిని రక్షించడానికి ఏర్పాట్లు చేయకముందే ఓ చెట్టు విరిగి నరో్త్తం మిశ్రా ఉన్న పడవపై పడింది. దీంతో పడవ మోటారు దెబ్బతిని పనిచేయలేదు. దీంతో మంత్రి నరోత్తం మిశ్రా ప్రభుత్వ అధికారులకు తమను రక్షించమని సందేశాలు పంపించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టరు వచ్చి తాడును కిందకు వదిలి మంత్రి మిశ్రాను సురక్షితంగా పైకి లాగారు. మంత్రితోపాటు వరదలో చిక్కుకున్న 9మందిని ఎయిర్‌లిఫ్ట్ చేశారు. కాగా వరద ప్రాంతాల్లో హోంశాఖమంత్రి మిశ్రా స్మైడర్ మ్యాన్ లాగా వ్యవహరించారని, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కాంగ్రెస్ నాయకుడు భూపేంద్ర గుప్తా ఆరోపించారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వరదల వల్ల 1250 గ్రామాలు నీటి మునిగాయి. 6,200 మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 


Updated Date - 2021-08-05T13:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising