ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ చెవులపై వెంట్రుకలు అధికంగా ఉన్నాయా? అయితే మీ అదృష్ట, దురదృష్టాల వివరాలు తెలుసుకోండి..

ABN, First Publish Date - 2021-11-08T14:21:57+05:30

మనిషి శరీరం అద్భుతాలకు నిలయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి శరీరం అద్భుతాలకు నిలయం. వీటిని తెలుసుకున్నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మనిషి దేహంలోని వివిధ అంగాల తీరుతెన్నులను అనుసరించి ఆ వ్యక్తి గుణగణాలను, అదృష్ట దురదృష్టాలను సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే సాముద్రిక శాస్త్రంలో నిపుణత సాధించివారు ఈ శాస్త్రం ఆధారంగా మనిషి భవిష్యత్‌ను కూడా చెబుతుంటారు. మనిషి జ్ఞానేంద్రియాల్లో ఒకటైన చెవి ఆకారాన్ని అనుసరించి కూడా ఆ మనిషి లక్షణాలను సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. సాధారణంగా చెవులపై అధికంగా వెంట్రుకలు ఉన్నవారు అదృష్టవంతులని అంటుంటారు. ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


ఏ వ్యక్తికైనా చెవి గుండ్రంగా ఉంటే అతను అత్యంత అదృష్టవంతుడని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అతని జీవితంలో ధనానికి, సకల సౌకర్యాలకు లోటు ఉండదు. 

ఎవరి చెవులపై పొడవైన వెంట్రుకలు ఉంటాయో వారికి పెద్దల నుంచి ఆస్తిపాస్తులు దక్కుతాయి. ఇటువంటివారు తెలివితేటలు కలిగినవారై ఉంటారు. ధనంతునిగా మారతాడు. 

పెద్ద చెవులు కలిగినవారు భగవంతుణ్ణి అమితంగా నమ్ముతారు. వీరు తమ జీవితాన్ని దైవ సేవకే అంకితం చేస్తారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. 


కోతి చెవులను పోలిన చెవులు కలిగినవారిలో స్వార్థ స్వభావం అధికంగా ఉంటుంది. అలాగే వీరు పిసినారిగా కూడా ఉంటారు. జీవితంలో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. 

చెవులపై చిన్నగా వెంట్రుకలు కలిగినవారు ఎంతో చతురత కలిగివుంటారు. వీరిలో స్వార్థం అధికంగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తి ధనసంపాదనకు అబద్ధాలను ఆశ్రయిస్తుంటాడు. 

పొడవైన చెవులు కలిగినవారు వ్యవహారదక్షులై ఉంటారు. 



Updated Date - 2021-11-08T14:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising