ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి మండపంలో వధువుతో కలిసి ఏడడుగులు వేసేందుకు నిరాకరించిన వరుడు.. పోలీసులు రంగప్రవేశం చేయడంతో..

ABN, First Publish Date - 2021-12-07T18:28:34+05:30

కల్యాణ మండపంలో వైభవంగా వివాహం జరుగుతోంది.. పీటల మీద వధువుతో కలిసి వరుడు కూర్చున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్యాణ మండపంలో వైభవంగా వివాహం జరుగుతోంది.. పీటల మీద వధువుతో కలిసి వరుడు కూర్చున్నాడు.. ఇంతలో వరుడి మెడలో వధువు తండ్రి బంగారు గొలుసు వేశాడు.. అంతే.. అగ్రహానికి గురైన వరుడు పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు.. వధువుతో కలిసి ఏడడుగులు వేసేందుకు నిరాకరించాడు.. పెళ్లి రద్దు చేయాలని పట్టుబట్టాడు.. వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు వరుడికి బుద్ధి చెప్పారు.. హర్యానాలోని కమల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


కమల్‌కు చెందిన వరుడు యోగేంద్రకు జింద్ ప్రాంతానికి చెందిన కోమల్‌తో వివాహం నిశ్చయమైంది. ఇద్దరూ ప్రభుత్వోద్యోగులు కావడంతో ఫైవ్‌స్టార్ హోటళ్లో సోమవారం రాత్రి వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. సగం పెళ్లి తంతు కూడా పూర్తయింది. ఆ సమయంలో వధువు తండ్రి తోమార్ వరుడి మెడలో బంగారు గొలుసు వేశాడు. ఆ గొలుసు యోగేంద్రకు నచ్చలేదు. అలాగే తనతో పాటు తన బావకు కూడా గొలుసు ఇవ్వాలని పట్టుబట్టాడు. అందుకు తోమార్ రెండ్రోజుల సమయం అడిగాడు. దీంతో ఆగ్రహం చెందిన యోగేంద్ర పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు. 


పెళ్లి రద్దు చేయాలని పట్టుబట్టాడు. అలాగే తనకు ఫార్చ్యూనర్ కారు, నగదు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో వధువు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వైపుల వారిని కూర్చోబెట్టి మాట్లాడారు. ఉదయం ఏడు గంటల వరకు ఇరు కుటుంబాల మధ్య పోలీసుల సమక్షంలో వాదోపవాదాలు జరిగాయి. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో వరుడు పెళ్లికి అంగీకరించాడు. వారి ఎదురుగానే వధువుతో కలిసి ఏడడుగులు వేశాడు. 

Updated Date - 2021-12-07T18:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising