ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బులెట్ బదులు అపాచె ఇస్తారా? అంటూ ఆ వరుడు ఏం చేశాడంటూ...

ABN, First Publish Date - 2021-04-13T13:59:35+05:30

యూపీలోని హత్రాస్ పట్టణంలోని అమర్‌పురఘనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్రాస్: యూపీలోని హత్రాస్ పట్టణంలోని అమర్‌పురఘనా ప్రాంతంలో ఒక వరుడు ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయాడు. కట్నం కింద ఇస్తామన్న బులెట్ బదులు అపాచే ఇవ్వడంతో గుర్రం మీద నుంచి దూకి, తన పెళ్లి దుస్తులను కూడా విప్పేసి నానా హంగామా చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వరునితోపాటు అతని తండ్రి, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపధ్యంలో వధువు తండ్రి తమకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ తేల్చిచెప్పేశాడు. 


వివరాల్లోకి వెళితే అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు లక్నోలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి హత్రాస్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమయ్యింది. రూ. 10 లక్షల కట్నం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే వరుడు తనకు బులెట్ వాహనం కావాలని కోరాడు. అయితే వధువు తరపువారు అపాచే బైక్ కొనుగోలు చేశారు. పెళ్లి వేడుక ప్రారంభమయ్యింది. వరుడు గుర్రం మీదకు ఎక్కి, ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో అక్కడున్న వారెవరో వరునితో బులెట్ బదులు అపాచీ వాహనం కొన్నారని చెప్పారు. ఈ మాట విన్నవెంటనే వరుడు ఆగ్రహంతో ఊగిపోతూ, గుర్రం మీద నుంచి దిగి, పెళ్లి దుస్తులు విప్పేసి, టీ షర్టు, ప్యాంటు ధరించి ఒక గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. దీనిని చూసిన పెళ్లివారంతా కంగారు పడిపోయారు. పెళ్లి కోలాహలమంతా ఆగిపోయింది. బులెట్ ఇవ్వకపోతే ఈ పెళ్లి జరగదంటూ వరుడు... వధువు తరపువారికి తెలిపాడు. ఈ విషయాన్ని వధువు తరపువారు పోలీసులకు తెలియజేశారు. మరోవైపు వధువు కూడా ఇటువంటి పెళ్లి కొడుకు తనకు అవసరం లేదంటూ తెగేసి చెప్పింది. ఇంతలో వివాహ ముహూర్తం కూడా దాటిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-13T13:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising