ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదెక్కడి ఫ్యామిలీ.. కట్నంగా వరుడి కుటుంబం వింత కోరికలు!

ABN, First Publish Date - 2021-07-23T18:13:06+05:30

వరకట్నం అనేది చట్టప్రకారం నేరం. అయినా అనధికారికంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరకట్నం అనేది చట్టప్రకారం నేరం. అయినా అనధికారికంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. వరుడి తరఫు వారి కోరిక మేరకు డబ్బు, బంగారం, పొలం, వాహానాలు వంటి వాటిని తమ శక్తి కొలది వధువు కుటుంబ సభ్యులు ఇస్తుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబ సభ్యులు వరకట్నం కింద వెరైటీ కోరికలు కోరారు. చివరకి కటకటాల పాలయ్యారు. 


మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ జంటకు ఫిబ్రవరి 10న నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలోనే వధువు తండ్రి కట్నంగా 2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం కాబోయే అల్లుడికి ఇచ్చారు. అయితే పెళ్లి సమయానికి ఇవి కావాలంటూ వరుడి తరఫు వారు ఓ జాబితాను వధువు తండ్రికి ఇచ్చారు. 21 గోర్లు గల తాబేళ్లు, ఒక నల్ల లాబ్రడార్ కుక్క, ఒక బుద్ధ విగ్రహం, సమై లాంప్‌స్టాండ్, రూ.10 లక్షలు మొదలైనవి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే వరుడి తరఫు వారు అడిగిన వాటిని వధువు తండ్రి ఇవ్వలేకపోయాడు. దీంతో వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వరకట్న నిషేధ చట్టం కింద వరుడి తరఫు బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-07-23T18:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising