ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో పెళ్లనగా అనూహ్య ఘటన.. ఆస్పత్రి పాలయిన వరుడు.. ఆ వధువు ఎవరిని పెళ్లి చేసుకుందో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-11-25T22:21:30+05:30

పెళ్లికి రంగం సిద్ధమైంది.. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి.. ఇరు వైపుల వారు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లికి రంగం సిద్ధమైంది.. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి.. ఇరు వైపుల వారు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు.. విందు కూడా ప్రారంభమైంది.. విందు ఆరగించిన వరుడు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యాడు.. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఆస్పత్రి పాలయ్యాడు.. అయినా ఆ పెళ్లి రద్దు కాలేదు.. వరుడి సూచన మేరకు వధువు పెళ్లి చేసుకుంది.. వరుడి ఫొటో పెట్టుకుని పెళ్లి తంతును పూర్తి చేసింది.


అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న విక్టోరియన్ పెళ్లి వేదిక వద్ద ఈ ఘటన జరిగింది. పెళ్లి మూహూర్తానికి రెండు గంటల ముందు వరుడు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ముహూర్త సమయానికి వరుడు కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పడంతో పెళ్లి రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వరుడికి ఆ పెళ్లి క్యాన్సిల్ కావడం ఇష్టం లేదు. ఐప్యాడ్‌లో తన ఫొటో పెట్టుకుని పెళ్లి తంతు పూర్తి చేయమని వధువుకు చెప్పాడు. వధువు అతడు చెప్పిన దానికి అంగీకరించింది. 


ఒక స్థంభానికి వెడ్డింగ్ సూట్ తొడిగి, దానిపై వరుడి ఫొటో ఉన్న ఐప్యాడ్ ఉంచి పెళ్లి కార్యక్రమాన్ని వధువు పూర్తి చేసింది. అతడి ఫొటోతోనే వధువు డ్యాన్స్ చేసింది. వెడ్డింగ్ కేక్‌ను కూడా కట్ చేసింది. కాగా, ఈ జంట ఇప్పటికే కరోనా కారణంగా రెండు సార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా వివాహం చేసుకోవాలని వరుడు కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకే అనారోగ్యానికి గురైనా పెళ్లిని మాత్రం వాయిదా వేయలేదు. 




Updated Date - 2021-11-25T22:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising