ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి వేడుకలో అపశ్రుతి.. తృటిలో తప్పించుకున్న వరుడు!

ABN, First Publish Date - 2021-12-15T22:46:34+05:30

పెళ్లి ఊరేగింపు ఘనంగా జరుగుతోంది.. గుర్రాలు లాగుతున్న రథంపై వరుడు ఠీవీగా నిల్చుని ఉన్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి ఊరేగింపు ఘనంగా జరుగుతోంది.. గుర్రాలు లాగుతున్న రథంపై వరుడు ఠీవీగా నిల్చుని ఉన్నాడు.. బంధువులు బాణాసంచా కాల్చుతూ సంతోషంగా ఉన్నారు.. ఆ సమయంలో రథంపైకి దూసుకొచ్చిన తారాజువ్వ భారీ అగ్నిప్రమాదానికి కారణమైంది. వెంటనే అప్రమత్తమైన వరుడు తన ప్రాణాలను కాపాడుకున్నాడు.. ఈ ఘటన గుజరాత్‌లోని పాంచ్‌మహల్‌ జిల్లాలో జరిగింది. 


పాంచ్‌మహల్ ప్రాంతానికి చెందిన తేజాస్ అనే వ్యక్తి పెళ్లి మండపానికి ఊరేగింపుగా రథంపై బయల్దేరాడు. ఆ రథం ముందు బంధువులు బాణాసంచా కాల్చుతూ కోలాహలంగా ఉన్నారు. ఆ క్రమంలో ఓ తారాజువ్వ రథానికి అమర్చిన జెనరేటర్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వరుడు వెంటనే రథం నుంచి దిగిపోయాడు. తనతో పాటు ఉన్న పిల్లలను కూడా కిందకు దింపేశాడు. పక్కనే ఉన్న వారు గుర్రాలను రథం నుంచి విడిపించారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రథం, జెనరేటర్లు మాత్రం కాలి బూడిదయ్యాయి. 


Updated Date - 2021-12-15T22:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising