ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే స్టేషన్లో ఫుట్‌పాత్‌పై ఉన్న బల్లపై కనిపించిందో బ్యాగ్.. అనుమానంగానే దగ్గరకు వెళ్లి పోలీసులు దాన్ని ఓపెన్ చేసి చూస్తే..

ABN, First Publish Date - 2021-11-19T23:44:09+05:30

ప్రయాణికుల రాకపోకలతో ఆ రైల్వే స్టేషన్ హడావిడిగా ఉంది. ప్రయాణికుల రద్దీ కాస్తంత సద్దుమణిగాక రైల్వే పోలీసులు ఫ్లాట్ ఫాంలను చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో దూరంగా ఉన్న బల్లపై ఓ బ్యాగ్ కనిపించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణికుల రాకపోకలతో ఆ రైల్వే స్టేషన్ హడావిడిగా ఉంది. ప్రయాణికుల రద్దీ కాస్తంత సద్దుమణిగాక రైల్వే పోలీసులు ఫ్లాట్ ఫాంలను చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో దూరంగా ఉన్న బల్లపై ఓ బ్యాగ్ కనిపించింది. దాని పక్కన ఎవరూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో దగ్గరకు వెళ్లి ఆ బ్యాగ్ ఎవరిదని ఆరా తీయగా.. అక్కడ ఉన్న వారందరూ తమది కాదని చెప్పారు. అపుడు పోలీసులు ఆధారం కోసం దాన్ని ఓపెన్ చేసి చూశారు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


ఉత్తరప్రదేశ్‌లోని రాంబాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఆరాధన దూబే అనే మహిళ తమ ఊర్లో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరింది. ఆమె వెళ్లాల్సిన రైలు రాగానే ఎక్కింది. కానీ ఆమె తన బ్యాగును అక్కడే వదిలేసి వెళ్లింది. రైలు వెళ్లిన కొద్దిసేపటికే పోలీసులు అక్కడ ప్లాట్‌ఫాంలన్నీ చెక్ చేశారు. ఈ క్రమంలోనే దూరంగా ఉన్న బల్లపై వారికి ఓ బ్యాగ్ కనిపించింది. దాని చుట్టుపక్కలా ఎవరూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి చూశారు. 


సబ్ ఇన్‌స్పెక్టర్ లలన్ యాదవ్ మాట్లాడుతూ.. బ్యాగ్ ఓపెన్ చేయగా అందులో తమకు 5 గోల్డ్ రింగులు, చెవి దిద్దులు లాంటి నగలతో పాటు వెండి ఆభరణాలు కూడా కనిపించాయని అన్నారు. అందులోని మొత్తం నగల విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందన్నారు. అయితే తమకు బ్యాగ్‌లో ఓ రిసిప్ట్ దొరికిందని.. అందులో ఉన్న నెంబర్ ఆధారంగా ఫోన్ చేయగా ఆ బ్యాగ్ ఆరాధన దూబే అనే మహిళకు చెందిందని గుర్తించామన్నారు. 


అయితే రైలు ఎక్కిన ఆరాధన బ్యాగ్ కోసం ఎంత వెతికినా ఆమెకు ఎక్కడా కనిపించలేదు. బ్యాగ్ ఎక్కడ పోగొట్టుకుందో తెలియక.. ఆమె కొండంత దుఃఖంలో మునిగిపోయింది. అపుడే ఆమెకు జీఆర్‌పీ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే భర్తతో కలిసి వెళ్లి పోలీసులను కలిసింది. అక్కడ వారు ఆరాధనకు తన బ్యాగ్‌ను తిరిగి అందించారు. దీంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బైంది. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంది. మౌ జిల్లాకు చెందిన లలన్ యాదవ్ నిజాయితీకి అక్కడ ఉన్న ప్రయాణికులందరూ ఫిదా అయ్యారు. కాగా ఆరాధన భర్త రాజీవ్ కుమార్ నైనీలోని సెంట్రల్ జైలులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.  


Updated Date - 2021-11-19T23:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising