ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Udipi జిల్లా మల్పెలో అరుదైన చేప లభ్యం

ABN, First Publish Date - 2021-11-25T18:12:04+05:30

ఉడుపి జిల్లాలోని మల్పెలో అరుదైన చేప లభ్యమైంది. సోమవారం రాత్రి శాన్‌రాజ్‌తొట్టంకు చెందిన బలరాం అనే బోటులో చేపల వేటకు వెళ్లిన బృందానికి గోళి అనే 21 కిలోల చేప లభించింది. తిరిగి ఓడరేవుకు వచ్చాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఉడుపి జిల్లాలోని మల్పెలో అరుదైన చేప లభ్యమైంది. సోమవారం రాత్రి శాన్‌రాజ్‌తొట్టంకు చెందిన బలరాం అనే బోటులో చేపల వేటకు వెళ్లిన బృందానికి గోళి అనే 21 కిలోల చేప లభించింది. తిరిగి ఓడరేవుకు వచ్చాక మంగళవారం వేలం వేశారు. రూ.1.90లక్షలు పలికింది. దీంతో కిలో 9,060రూపాయలైంది. సాధారణంగా ఈ రకం చేపను ఔషధాల తయారీకి ఉపయోగిస్తుంటారు. ఫయాజ్‌ అనే వ్యక్తి ఈ చేపను కొనుగోలు చేశారు. ముంబై ఓడరేవులో ఈ చేప కిలో రూ.15వేల నుంచి 18వేల వరకు పలుకుతుందన్నారు. ముంబై నుంచి నేరుగా ఔషధ కంపెనీలే కొనుగోలు చేస్తాయన్నారు. గోళి రకం చేపలు రాళ్లమధ్యన ఉంటాయని వలకు దొరకడం అరుదు అన్నారు. మల్పెలో గోళిరకం చేప లభించడం చాలా అరుదు అని ఒక వేళ దొరికినా ఐదారు కిలోలకు మించవన్నారు. ఈసారి ఏకంగా 21కిలోల చేప లభించడం ఒక రికార్డుగా భావిస్తున్నట్టు చేపల వ్యాపారులు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-11-25T18:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising