ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో గంటల కొద్దీ మాటలు.. అక్క చూసిందని భయపడి ఆమె చేసిన చిన్న తప్పు ఎంతటి ఘోరానికి కారణమైందంటే..

ABN, First Publish Date - 2021-12-24T18:32:33+05:30

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. ముంబైలో పదో తరగతి చదువుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు.. ముంబైలో పదో తరగతి చదువుతోంది.. చదువు సంగతి పక్కన పెట్టి బాయ్‌ఫ్రెండ్‌తో రోజూ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేది.. ఆమెను గమనించిన తల్లిదండ్రులు తీవ్రంగా హెచ్చరించారు.. అయినా ఆమెలో మార్పురాలేదు.. రహస్యంగా మాట్లాడేది.. ఈ క్రమంలో ఆమె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమె అక్క చూసేసింది.. ఆమె నుంచి తప్పించుకోబోయిన బాలిక ఆరో అంతస్థు నుంచి కింద పడిపోయింది.. ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


అంధేరీ వర్సోవా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులో కుటుంబ సభ్యలతో కలిసి నివాసముంటున్న 16 ఏళ్ల బాలిక తరుచూ ఢిల్లీలో ఉంటున్న బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండేది. ఆమె తీరును గమనించిన తల్లిదండ్రులు ఇటీవల తీవ్రంగా మందలించారు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. తల్లిదండ్రులు చూడకుండా రహస్యంగా మాట్లాడేది. గత ఆదివారం బాల్కనీలో నిల్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ఆమె సోదరి చూసేసింది. 


సోదరి మందలిస్తుందనే భయంతో ఇంటి నుంచి పారిపోవాలని ఆ బాలిక అనుకుంది. నాలుగైదు చీరలను ముడివేసి వాటి సాయంతో బాల్కని నుంచి కిందికి దిగి పారిపోవాలని ప్రయత్నం చేసింది. అయితే కిందకు దిగే క్రమంలో ఐదో అంతస్థు నుంచి జారి పడిపోయింది. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. 

Updated Date - 2021-12-24T18:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising