ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Spiderman's Daughter: ఉత్త చేతులతో గదిలో గోడలను ఎక్కేస్తున్న బాలిక.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2021-09-18T23:06:45+05:30

కాళ్లకు, చేతులకు ఎటువంటి ఆధారం లేకుండా.. గోడపై పాకడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? ఇటువంటి దృశ్యాలను కేవలం స్పైడర్ మ్యాన్ లాంటి కొన్ని ప్రత్యేకమైన సినిమాల్లోనే చూస్తాం. అయితే ఓ చిన్నారికి మాత్రం ఇది సాధ్యమైంది. ప్రస్తుతం అందుకు సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కాళ్లకు, చేతులకు ఎటువంటి ఆధారం లేకుండా.. గోడపై పాకడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? ఇటువంటి దృశ్యాలను కేవలం స్పైడర్ మ్యాన్ లాంటి కొన్ని ప్రత్యేకమైన సినిమాల్లోనే చూస్తాం. అయితే ఓ చిన్నారికి మాత్రం ఇది సాధ్యమైంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 



వీడియోలోని దృశ్యాల ప్రకారం.. పదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న ఓ చిన్నారి తన ఇంటి గదిలోని గోడలపైకి ఉత్త కాళ్లు, చేతుల సహాయంతోనే సీలింగ్ వరకూ గబగబా పాకేసింది. అనంతరం.. కాళ్లను గాలిలో ఆడిస్తూ విన్యాసాలు చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటి వరకూ అక్కడే ఉన్న ఆ చిన్నారి.. తిరిగి మెల్లిగా కిందకి దిగడం ప్రారంభించింది. కొద్ది దూరం వరకూ నెమ్మదిగా వచ్చి.. అ తర్వాత కిందకు దూకేసింది. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. 55 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు 1.37లక్షల మంది వీక్షించగా.. ఇందులో మూడు వేల మంది దీన్ని లైక్ చేశారు. కొందరు ఈ వీడియోను చూసి, జగపతి బాబు హీరోగా నటించిన ‘రక్ష’ సినిమా గుర్తొంచ్చిదంటూ కామెంట్ చేస్తున్నారు.


Updated Date - 2021-09-18T23:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising