ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మాయిల బైక్ స్టంట్ వీడియో వైరల్.. షాక్ ఇచ్చిన పోలీసులు!

ABN, First Publish Date - 2021-03-16T21:28:31+05:30

ఓ అమ్మాయి బుల్లెట్ బైక్‌ను నడిపిస్తూ... తన భుజాలపై మరో యువతిని కూర్చోబెట్టుకున్నట్టు వీడియోలో కనిపిస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్: ఓ బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కెమేరాలకు చిక్కడంతో పోలీసులు వారికి భారీ జరిమాన విధించారు. వీరు చేస్తున్న స్టంట్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. యువతులను ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. హెల్మెట్ ధరించకపోవడం, అనుమతులు లేకుండా రేసింగ్‌ జరపడం సహా  పలు డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆ బైక్ యజమానికి మొత్తం 11 వేల రూపాయల చలాన్లు జారీ చేశారు. 


ఓ అమ్మాయి బుల్లెట్ బైక్‌ను  నడిపిస్తూ... తన భుజాలపై మరో యువతిని కూర్చోబెట్టుకుని వెళ్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఎదురుగా వాహనాలు వస్తున్నప్పటికీ ఏమాత్రం బెరుకులేకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లారు. స్థానిక జిమ్‌ పేరుతో టీ-షర్టులు ధరించిన వీరిద్దరూ.. కనీసం హెల్మెంట్లు కూడా పెట్టుకోలేదు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఘజియాబాద్ పోలీసులు రూ. 11 వేలు జరిమాన విధించినట్టు ట్విటర్లో వెల్లడించారు. ‘‘ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. మీ జీవితాలను, ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టకండి..’’ అని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఇద్దరు అమ్మాయిల గుర్తింపు వివరాలు ఇప్పటికీ వెల్లడికాలేదు. ఈ వీడియోను ప్రమోషన్ కోసం తీశారా లేదా అనేది కూడా ఇంకా తెలియరాలేదు. 



Updated Date - 2021-03-16T21:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising