ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bipin Rawat షహ్‌దోల్‌లో సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తానన్నారు...గుర్తు చేసుకున్న రావత్ బావమరిది యశ్వర్ధన్‌సింగ్

ABN, First Publish Date - 2021-12-09T14:00:42+05:30

హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన త్రివిధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు తన అత్త వారిల్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షహ్‌దోల్ పట్టణంతో ఎంతో అనుబంధం ఉండేది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య స్వస్థలమైన షహ్‌దోల్ వస్తానన్నారు షహ్‌దోల్‌లో సైనిక పాఠశాల ఏర్పాటు చేస్తానన్నారు

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన త్రివిధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు తన అత్త వారిల్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షహ్‌దోల్ పట్టణంతో ఎంతో అనుబంధం ఉండేది. 1986వ సంవత్సరంలో సైన్యంలో రావత్ కెప్టెన్ గా ఉన్నపుడే షహ్‌దోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ గర్హికి చెందిన దివంగత కున్వర్ మృగేంద్ర సింగ్ కుమార్తె మధులికను వివాహం చేసుకున్నారు.‘‘వచ్చే ఏడాది రావత్ జనవరిలో మధ్యప్రదేశ్‌లోని షహ్‌దోల్ లో ఉన్న తన భార్య పూర్వీకుల ఇంటికి వస్తానని చెప్పారు. షహ్‌దోల్ జిల్లాలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేస్తానని ఫోర్-స్టార్ జనరల్ అయిన బావగారు రావత్ వాగ్దానం చేశారని అతని బావమరిది యశ్వర్ధన్ సింగ్ కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు.


షహ్‌దోల్ జిల్లాలో వెనుకబడిన వర్గాల విద్యార్థులు సాయుధ దళాల్లో చేరేందుకు సిద్ధం చేసుకోవడానికి సహాయపడేలా సైనిక పాఠశాల పెడతానని రావత్ చెప్పారని, కానీ అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని సింగ్ పేర్కొన్నారు.తమిళనాడులోని కూనూర్ సమీపంలో కూలిపోయిన ఎంఐ-17వీ5 మిలిటరీ హెలికాప్టర్‌లో రావత్ తో పాటు అతని భార్య మధులిక కూడా మరణించింది. మధులిక తల్లి ఉన్నా, బాగా వృద్ధురాలు కావడంతో కూతురు, అల్లుడి మరణవార్తను ఆమెకు చెప్పలేదు. హెలికాప్టర్ ప్రమాదం జరిగి రావత్ దంపతులు మరణించిన ఘటనతో ఆర్మీ అధికారులు ప్రత్యేక విమానంలో రావత్ అత్తగారు, బావమరిది యశ్వర్ధన్ సింగ్, ఇతర బంధువులను ఢిల్లీకి తీసుకువచ్చారు. 


‘‘నేను చివరిసారిగా దసరా పండుగ సందర్భంగా బావగారైన రావత్ ను కలిసి మాట్లాడాను. గిరిజనులు అధికంగా ఉన్న షహదోల్ జిల్లాలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేస్తానని బావగారు హామీ ఇచ్చారని, అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.’’ అని బావమరిది యశ్వర్ధన్ సింగ్ గుర్తు చేసుకున్నారు.రావత్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరు ముంబైలో నివసిస్తుండగా, మరో కుమార్తె వారితో కలిసి ఢిల్లీలోనే ఉంటున్నారు. 


Updated Date - 2021-12-09T14:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising