ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ వీడియో.. ప్రేమను కౌగిలింతలో ప్యాక్ చేసి ఇస్తే..

ABN, First Publish Date - 2021-04-15T23:51:08+05:30

కౌగిలింత..ప్రేమను వ్యక్తం చేసే ఓ చర్య! నేనున్నాను..నీకేం కాదు అనే భరోసా! మరి కౌగిలింతలు మనుషులకే పరిమితమా అంటే కానే కాదు. జంతువులు కూడా అప్పుడప్పుడూ మన భాషలోనే మనపై ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. పెంపుడు జంతువులు ఉన్న వారికి ఈ విషయం సుపరిచితమే. ప్రస్తుతం ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కౌగిలింత..ప్రేమను వ్యక్తం చేసే ఓ చర్య! నేనున్నాను..నీకేం కాదు అనే భరోసా! మరి కౌగిలింతలు మనుషులకే పరిమితమా అంటే కానే కాదు. జంతువులు కూడా అప్పుడప్పుడూ మన భాషలోనే మనపై ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. పెంపుడు జంతువులు ఉన్న వారికి ఈ విషయం సుపరిచితమే. ప్రస్తుతం ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటవీ శాఖ అధికారి సుశాంత నంద దీన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. సముద్రంలో స్కూబా డైవింగ్‌కు దిగిన ఓ వ్యక్తి వద్దకు సీల్ వచ్చి అచ్చు మనిషిలాగే అతడిని కౌగిలించుకుంటుంది. స్కూబా డైవర్ కూడా అందుకు తగ్గట్టుగానే సీల్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వీపుపై తడతాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అందరూ తెగ మురిసిపోతున్నారు. ఆ స్కూబా డైవర్ చాలా అదృష్టవంతుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అతడి అదృష్టానికి మాకు అసూయ కలుగుతోందని కూడా కొందరు కామెంట్ చేశారు. ఇక సుశాంత నందా కూడా ఈ వీడియోపై తన దైన శైలిలో కామెంట్ చేశారు. ప్రేమను కౌగిలింతలో చుట్టి ఇస్తే.. అంటూ క్యాప్షన్ జత చేశారు. 1.2 వేల లైకులతో తెగ వైరల్ అవుతున్న ఈ క్యూట్ వీడియోను వీరూ ఓ లుక్కేయండి..!



Updated Date - 2021-04-15T23:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising