ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ఈ 8 జీవిత సత్యాలను తెలుసుకుంటే.. మీకు అన్నింటా విజయమే!

ABN, First Publish Date - 2021-10-30T12:31:06+05:30

నేటి ఆధునిక కాలంలోనూ ఆచార్య చాణక్యుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి ఆధునిక కాలంలోనూ ఆచార్య చాణక్యుని గురించి తెలియనివారెవరూ ఉండరు. చాణక్యుని కథలలో, చాణక్య నీతిలో జీవిత సత్యాలెన్నో కనిపిస్తాయి. చంద్రగుప్త మౌర్యునికి సలహాదారుగా పనిచేసిన చాణక్యుడు ఆయనను రాజును చేశారు. చాణక్యుని తెలివితేటల కారణంగా ఒక సాధారణ పిల్లవాడు రాజుగా మారాడు. చాణక్య నీతిలో పేర్కొన్న ఈ 8 జీవిత సత్యాలను గ్రహంచగలిగితే.. మనం అన్నింటా విజయం సాధించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1.  ఒక వ్యక్తి ఎప్పుడైనా తన చేతల ద్వారానే గొప్పవాడవుతాడు. అతని పుట్టుకతో కాదు.

2. ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకుని, మరింత దిగజారిపోయి, జీవితం వృథాగా మారినపుడు ఎంతగానో చింతిస్తాడు.

3. జీవితంలో డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానిని గుర్తెరిగి మనిషి మెలగాలి.

4. వెయ్యి ఆవులలో కలసిపోయిన దూడ తన తల్లిని గుర్తించినట్లుగా, మనిషి కర్మ ఫలం అతని వెంట వస్తుంది.

5. మనిషి శారీరక శక్తి పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా దృఢంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ అతనిని ఓడించలేదు.


6. పాలలో కలసిన నీరు కూడా పాలుగా మారినట్లు, మూర్ఖుడు జ్ఞానితో సహవాసం చేస్తే. తద్వారా అతను కూడా జ్ఞానిగా మారతాడు.

7. జీవితంలో అతి పెద్ద గురు మంత్రం ఏమిటంటే.. మీరు మీ వ్యక్తిగత రహస్యాలను మరెవరికీ చెప్పకూడదు. అది మీ వినాశనానికి కారణం కావచ్చు.

8. జ్ఞానం ద్వారా డబ్బు సంపాదించగలం, తద్వారా మనిషికి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. 

Updated Date - 2021-10-30T12:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising