ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిమ్మల్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించే ఐదు ఉత్తమ సలహాలు... కష్ట సమయాల్లో కూడా ఇబ్బందులు పడరు!

ABN, First Publish Date - 2021-10-10T13:42:03+05:30

జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు మనిషిని కుంగదీస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు మనిషిని కుంగదీస్తాయి. ఎంతటివారైనా సరే ఏదో ఒక సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసివస్తుంటుంది. అయితే మీరు కొద్దిగా ప్లానింగ్‌తో ఉండగలిగితే మీ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలగడమే కాకుండా, వాటినుండి విజయవంతంగా బయటపడగలుగుతారు. అయితే అందుకు సరైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం... 


పెట్టుబడులు ఆపవద్దు: జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, పెట్టుబడులు పెట్టడం ఆపకూడదు. నెలవారీ పెట్టుబడి లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది అందరికీ చాలా అవసరం. ఈ నిధులు భవిష్యత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కష్టకాలంలో మనల్ని ఆదుకుంటాయి. 

అత్యవసర నిధి తప్పనిసరి: మీ ఇంటి ఖర్చుల కోసం మూడు నెలలకు సరిపడా అవసరమైన మొత్తాన్ని ముందుగానే అత్యవసర నిధిగా  ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఈ నిధిని బ్యాంక్ పొదుపు ఖాతాలో లేదా మ్యూచువల్ ఫండ్ రూపంలో జమచేయవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ నిధిని ఉపయోగించాలి.

భాగస్వామికి పెట్టుబడి సమాచారాన్ని తెలియజేయండి: మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టారో దానికి సంబంధించిన వివరాలను మీ జీవిత భాగస్వామికి తప్పనిసరిగా తెలియజేయండి. ఈ పెట్టుబడులలో లోటుపాట్లు తలెత్తినపుడు మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. 


జీవిత బీమా, ఆరోగ్య బీమా అత్యవసరం: ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలంటే మీరు తప్పనిసరిగా ఆరోగ్య బీమా, జీవిత బీమాలను కలిగి ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు జీవిత బీమా మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది, ఏదైనా వైద్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితిలో ఆరోగ్య పాలసీ అనేది మీకు ఎంతగానో సహాయపడుతుంది.

నామినీ తప్పనిసరి: మీ బ్యాంక్ ఖాతా, పెట్టుబడి లేదా బీమా పాలసీల కోసం ఎవరినైనా నామినీగా ఉంచండి. నామినీని ఉంచడం ద్వారా, భవిష్యత్‌లో మీ కుటుంబ సభ్యులు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకునే సమస్య తలెత్తదు. మీరు ఎవరినైనా నామినీగా ఉంచినట్లయితే, బీమా సొమ్మును సంబంధిత కంపెనీ నుంచి సులభంగా తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.  

Updated Date - 2021-10-10T13:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising