ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడలోతు బురదలో చిక్కుకున్న గుర్రం.. రక్షించిన వ్యక్తికి అస్వస్థత

ABN, First Publish Date - 2021-06-19T22:21:11+05:30

మెడలోతు బురదలో చిక్కుకున్న గుర్రం.. రక్షించిన వ్యక్తికి అస్వస్థత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాత్: మెడలోతు బురదలో చిక్కుకున్న గుర్రాన్ని అత్యంత సాహసోపేతంగా అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది. వోరా వంతెన సమీపంలో రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలో ఉన్న ఆజీ నదిలో ఎనిమిది అడుగుల లోతులో ఉన్న బురదలో గుర్రం చిక్కుకుంది. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన ఆలయ పూజారి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ 45 నిమిషాల పాటు సాగింది. ట్యూబ్ సాయంతో గుర్రం ఉన్న ప్రాంతానికి అతి కష్టం మీద పాకుతూ వెళ్లిన వ్యక్తి దాని మెడకు తాడు కట్టి బయటకు లాగారు. సజీవంగా గుర్రం బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో రెస్క్యూ చేసిన వ్యక్తి నదిలోని కాలుష్య వాయువులు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. 

Updated Date - 2021-06-19T22:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising