ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమ్మా.. గ్యాస్ స్టవ్‌ రిపేర్ చేస్తాం’ అంటూ వచ్చి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు.. వీరేం చేస్తారో తెలిస్తే దడ పుట్టడం ఖాయం!

ABN, First Publish Date - 2021-10-14T16:23:22+05:30

ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఎక్కడో ఒకచోట లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి నెట్‌వర్క్ నడిపేవారు రకరకాల పద్ధతుల్లో లింగనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా హర్యానాలో ఇటువంటి ఉదంతం వెలుగుచూసింది. చట్ట వ్యతిరేకంగా లింగనిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న లలిత్ త్యాగి అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్ త్యాగి గ్యాస్ స్టవ్‌లను రిపేర్ చేస్తుంటాడు. ఆరోగ్య విభాగానికి చెందిన అధికారులు అతని దగ్గరకు ఒక వ్యక్తిని పంపించారు. అతను లలిత్ త్యాగితో తాను లింగనిర్థారణ పరీక్షలు చేయించేందుకు వచ్చానని చెప్పడంతో అతను కొంత మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. 


దీంతో ఆరోగ్యవిభాగం అతనిపై పీఎన్డీటీ యాక్ట్ మేరకు కేసు నమోదు చేసింది. వైద్య అధికారుల బృందం లలిత్ త్యాగి ఇంటిపై దాడులు చేసింది. నిందితుడు తాను గతంలో యూపీలోని మురాదానగర్ కూడా ఇటువంటి పరీక్షలు చేయించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ జయకిషోర్ మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు మాటువేసి నిందితుడిని పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు ఇంటింటికీ తిరిగి కూడా గ్యాస్ స్టవ్‌లు రిపేర్ చేస్తుంటాడు.



Updated Date - 2021-10-14T16:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising