ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడి ముందు పూలు అమ్ముకుంటూ.. అతి సాధారణంగా కనిపిస్తున్న ఈమెకు మరో బ్యాక్‌గ్రౌండ్ ఉంది.. అదేంటంటే..

ABN, First Publish Date - 2021-09-04T00:41:35+05:30

సీఐడీలో పనిచేసే మహిళ.. అకస్మాత్తుగా పూలు అమ్ముకుంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అది ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ప్రాంతం..అక్కడో కృష్ణుడి గుడి! గుడి పక్కనే ఓ పూల షాపు..  ఓ మహిళ అక్కడ పూలు అమ్ముతోంది. ఆమె చూడటానికి అత్యంత సాధారణంగా ఉంది. మరోవైపు.. చత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు ఓ మహిళ కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. తాము వెతుకుతున్న వ్యక్తి ఆ ప్రాంతంలోనే ఉన్నట్టు వారికి సమాచారం ఉంది. ఈ క్రమంలో వారు గుడి వద్ద పూలు అమ్ముకుంటున్న ఆమెను చూసి ఒక్కసారిగా షాకైపోయారు. ఆ తరువాత.. ఆమె ఎవరో తెలుసుకుని స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు..అసలేం జరిగిందంటే..


అంజనా సాహిస్ అనే మహిళ సీఐడీ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసేవారు. మొదట్లో రాయిగఢ్‌లో పనిచేసిన ఆమె.. తొమ్మిది నెలల క్రితం రాయూపూర్‌కు బదిలీ అయింది. అప్పట్లో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి నివసించేది. ఈ క్రమంలో ఒకరోజు అంజనా అకస్మాత్తుగా అదృశ్యమవడంతో కుటుంబసభ్యులు, పోలీసు అధికారులు ఒక్కసారిగా షాకైపోయారు. ఆమె కిడ్నాప్ గురైందా లేదా ఎక్కడికైనా తనే వెళ్లిపోయిందా అనేదానిపై ఎవరి వద్దా ఎటువంటి సమాచారం లేదు. దీంతో..ఆగస్టు 21ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత..పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


తోలినాళ్లలో కేసులో ఎటువంటి పురోగతీ లభించలేదు. ఆమె వద్ద మొబైల్ ఫోన్ ఏదీ లేకపోవడం..దర్యాప్తుకు ఆటంకంగా మారింది. ఈ క్రమంలో అధికారులు ఆమె బ్యాంకు ట్రాన్సాక్షన్ వివరాలను పరిశీలించారు. ఆ సందర్భంలో బృందావన్ లోని ఓ ఏటీఎంలో నగదు తీసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆలా..అంజనా ఆచూకీ గురించి పోలీసులకు తెలిసింది. కానీ..పోలీసులు ఆమెను వెనక్కు తీసుకొద్దామని ప్రయత్నించినా ఆమె తిరస్కరించింది.తాను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతానని స్పష్టం చేసింది. 


అంజనా అదృశ్యమవడం వెనుక కారణం ఇదే..

అయితే.. అంజనా ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడానికి కారణమెంటో తెలుసుకునేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కొందరి పైఅధికారుల తీరువల్ల తనకు విసుగొచ్చి వెళ్లిపోయినట్టు ఆమె తెలిపింది. ఆ అధికారులు ఎవరు..వారి వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగిందీ.. అనే వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. ఆమెను వెనక్కుతీసుకొచ్చేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె ససేమిరా అంది.  జీవితాంతం ఇలాగే బతికేస్తానని తేల్చి చెప్పింది. దీంతో.. చేసేందేం లేక పోలీసులు వెనక్కు వచ్చేశారు.  

Updated Date - 2021-09-04T00:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising