ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకొద్దు.. నా భార్యకు కూడా వ్యాక్సిన్ వేయొద్దు.. ఆధార్‌ కార్డుతో సహా చెట్టెక్కిన భర్త!

ABN, First Publish Date - 2021-06-26T20:33:04+05:30

వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ ఆధార్ కార్డు పట్టుకుని చెట్టెక్కేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`నాకు, నా భార్యకు వ్యాక్సిన్ వద్దు బాబోయ్` అంటూ ఆధార్ కార్డు పట్టుకుని చెట్టెక్కేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. టీకా వేయించుకోవడానికి భయపడడమే దానికి కారణం. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో పతంకాలన్‌ గ్రామంలో తాజాగా కోవిడ్‌ టీకా శిబిరం నిర్వహించారు. అందరూ శిబిరానికి రావాలని కోరారు. అదే గ్రామానికి చెందిన కన్వర్‌లాల్ కూడా టీకా కేంద్రానికి వచ్చాడు. కానీ, అక్కడ వ్యాక్సిన్‌ వేయడం చూసి భయపడి పోయాడు.


వ్యాక్సిన్ నుంచి తప్పించుకునేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన భార్య మాత్రం టీకా తీసుకోవడానికి అంగీకరించింది. అయితే అతడు ఆమె ఆధార్‌ కార్డు కూడా తనతో పాటు చెట్టు పైకి తీసుకెళ్లాడు. దీంతో ఆమె కూడా కరోనా టీకా వేయించుకోలేకపోయింది. ఈ విషయం తెలిసి ఖుజ్నర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్.. కన్వర్‌లాల్‌తో మాట్లాడారు. దీంతో కన్వర్‌లాల్‌కు టీకా అంటే భయం తగ్గింది. ‍మరోసారి గ్రామంలో శిబిరం జరిగినప్పుడు టీకా తీసుకుంటామని చెప్పాడు. 

Updated Date - 2021-06-26T20:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising