ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు పెళ్లి గురించి ఊరంతా చెప్పుకోవాలని ఓ తండ్రి వినూత్న ఆలోచన.. చూసేందుకు ఎగబడ్డ జనం..!

ABN, First Publish Date - 2021-12-13T21:19:25+05:30

వాళ్లిద్దరూ ప్రభుత్వోద్యోగులు.. వారికి ఒక్కగానొక్క కొడుకు.. ప్రస్తుతం డాక్టర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాళ్లిద్దరూ ప్రభుత్వోద్యోగులు.. వారికి ఒక్కగానొక్క కొడుకు.. ప్రస్తుతం డాక్టర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.. అతనికి పెళ్లి కుదిరింది.. తన కొడుకు పెళ్లి గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలనేది ఆ తండ్రి కోరిక.. అందుకే వినూత్న ఆలోచన చేశాడు.. కోడలిని ఆమె ఊరి నుంచి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చేందుకు ఏకంగా ఓ హెలీకాఫ్టర్‌ను బుక్ చేశాడు.. దీంతో జనమంతా ఆ పెళ్లి గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు.. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ పెళ్లి జరుగుతోంది. 


బార్మర్ జిల్లాలోని బిందాని గ్రామానికి చెందిన తిలారామ్, ఆయన భార్య పార్వతి ప్రభుత్వోద్యోగులు. వారి కొడుకు తరుణ్ డాక్టర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తరుణ్‌కు ఇటీవల దియా అనే యువతితో పెళ్లి కుదురింది. ఈ రోజు (సోమవారం) రాత్రి వీరి వివాహం జరగబోతోంది. తమ ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని తిలారామ్, పార్వతి ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. వధూవరులను పెళ్లి మండపానికి కారులో కాకుండా హెలీకాఫ్టర్‌లో తీసుకురావాలని అనుకున్నారు. 


రూ.6 లక్షల రూపాయలు పెట్టి ఓ హెలీకాఫ్టర్‌ను బుక్ చేశారు. అంతేకాదు అది దిగేందుకు ఆ గ్రామంలో ఓ హెలీప్యాడ్‌ను కూడా నిర్మించారు. వరుడు కొద్ది సేపటి క్రితం తను నివాసం ఉంటున్న నగరం నుంచి వధువు ఊరికి హెలీకాఫ్టర్‌లో వెళ్లి అక్కణ్నుంచి కల్యాణమండపానికి ఆమెను తీసుకువచ్చాడు. ఆ హెలీకాఫ్టర్‌ను చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. ఈ పెళ్లి ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. 



Updated Date - 2021-12-13T21:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising