ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినోదం కోసం కొడుకుకు డీఎన్ఎ టెస్టు...రిజల్ట్ చూసి చెమటలు కక్కిన తండ్రి!

ABN, First Publish Date - 2021-08-30T13:24:50+05:30

అమెరికాకు చెందిన ఒక వ్యక్తి వినోదం కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఒక వ్యక్తి వినోదం కోసం తన కొడుకుకు డీఎన్ఏ టెస్టు చేయించాడు. ఎంతో ఆతృతతో రిపోర్టును చూసిన ఆ తండ్రి గుడ్లు తేలేసి, చెమటలు కక్కాడు. వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఇద్దరు కుమారుల తండ్రి అయిన వన్నెర్ జాన్సన్ 12 ఏళ్ల  తరువాత వినోదం కోసం తన రెండవ కుమారునికి డిఎన్ఏ టెస్టు చేయించాడు. 


రిపోర్టులో ఆ బాలుడు వారి కన్నకుమారుడు కాదని తేలింది. ఐవీఎఫ్‌ సమయంలో ఫ్యూజన్‌(కలయిక)లో పొరపాటు చోటుచేసుకున్న కారణంగా ఈ సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులు రెండవ సంతానం కోసం 2007లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) అంటే కృత్రిక గర్భధారణ విధానాన్ని ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో డోనా గర్భం దాల్చి కుమారునికి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలతో ఆ దంపతుల జీవితం హాయిగా సాగుతూ వచ్చింది. 12 ఏళ్ల తరువాత వన్నెర్ జాన్సన్ తన రెండవ కుమారునికి డీఎన్ఏ టెస్టు చేయించాడు. అంతే ... ఆ దంపతుల ఆనందం అంతా ఆవిరైపోయింది. ఈ రిపోర్టు చూసిన వన్నెర్ జాన్సర్ తన భార్యకు ఐవీఎఫ్ చికిత్స అందించిన క్లినిక్‌పై కేసు వేశారు. వన్నెర్ జాన్సన్ తీసుకున్న రిపోర్టులో తన రెండవ కుమారుని తల్లి పేరు డోనా అని ఉండగా, తండ్రి ఎవరో తెలియదంటూ ఉంది. దీనిపై దర్యాప్తు చేపట్టగా, ఒక ఫ్యూజన్‌లో పొరపాటు చోటు చేసుకున్నదని తేలింది. డోనాకు సంబంధించిన అండం వేరొకరి వీర్యంతో ఫ్యూజన్ అయ్యిందని తేలింది. ఫలితంగా ఈ సమస్య తలెత్తిందని వెల్లడయ్యింది.

Updated Date - 2021-08-30T13:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising